Mon Dec 23 2024 18:41:49 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభాస్ తో పెళ్లివార్తలపై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్.. ఇదంతా ఆ హీరో వల్లే..
ఇందుకు యువహీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చాయి. ఈ మధ్య ‘బేధియా’ సినిమా ప్రమోషన్లలో..
మహేశ్ నటించిన '1 నేనొక్కడినే' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్. తెలుగులో అరంగేట్రం చేసిన ఈ ముంబై భామ.. ఆ తర్వాత బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా పేరు గడించింది. వరుస సినిమాలతో దూసుకుపోతూ.. తనకంటూ క్రేజ్ ఏర్పరుచుకుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఆదిపురుష్ సినిమాలో..ప్రభాస్ సరసన నటించింది కృతి సనన్. ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, కృతి సీత పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా టీజర్, ట్రెయిలర్ లాంచ్, ప్రమోషన్లలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్నారు.
ఒక సినిమా ప్రమోషన్లలో హీరో, హీరోయిన్ కలిసి పాల్గొనడం మామూలే. కానీ.. ఈ మధ్య ఏ జంట కనిపించినా వారు డేటింగ్ లో ఉన్నారని, ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్లు వ్యాపిస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి సనన్ ల విషయంలోనూ అదే జరిగింది. సినిమా సమయంలో ప్రభాస్, కృతి సనన్ మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పుకార్లు వస్తున్నాయి.
ఇందుకు యువహీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు కూడా బలం చేకూర్చాయి. ఈ మధ్య 'బేధియా' సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ షోలో పాల్గొన్న కృతి సనన్ పై వరుణ్ ధావన్ కామెంట్స్ చేశాడు. కృతి మనసు ఇక్కడ లేదని, దీపికాతో నటిస్తోన్న ఓ నటుడి వద్ద ఉందంటూ ప్రభాస్ గురించి పరోక్షంగా ప్రస్తావన తెచ్చాడు. ఫైనల్ గా ఈ పుకార్లపై కృతి స్పందించింది. ప్రభాస్ తో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించింది. వరుణ్ చేసిన వ్యాఖ్యలే ఈ పుకార్లకు దారితీశాయని చెప్పింది. తమకు రిలేషన్ ఉందంటూ వస్తున్న పుకార్లను కృతి కొట్టిపారేసింది.
Next Story