కృతి శెట్టి పై టాలీవుడ్ హీరోల కన్ను!
ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా పల్లెటూరి అమ్మాయిగా క్యూట్ లుక్స్ తో అదరగొట్టేస్తున్న కృతి శెట్టి కి మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు, సూపర్ హిట్ [more]
ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా పల్లెటూరి అమ్మాయిగా క్యూట్ లుక్స్ తో అదరగొట్టేస్తున్న కృతి శెట్టి కి మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు, సూపర్ హిట్ [more]
ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా పల్లెటూరి అమ్మాయిగా క్యూట్ లుక్స్ తో అదరగొట్టేస్తున్న కృతి శెట్టి కి మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు, సూపర్ హిట్ అవలేదు. కృతి శెట్టి మీద ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కన్ను పడింది. టాలీవుడ్ యంగ్ హీరోస్ కృతి శెట్టిని వదిలేలా కనిపించడం లేదు. ఉప్పెన ప్రమోషన్స్ లో లంగా వోణి తో కనబడుతూ.. ఎంత సక్కగున్నావే అని అనిపించుకుంటున్న కృతి శెట్టి లక్కు మాములుగా లేదు. అందుకే వరస ఆఫర్స్ కృతి శెట్టి తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యాం సిగ్ రాయ్ ఆఫర్ కొట్టేసిన ఈ బ్యూటీ సుధీర్ బాబు సినిమాలో ఆఫర్ పట్టినట్లుగా టాక్ ఉంది.
ఇప్పుడు తాజాగా అఖిల్-సురేందర్ రెడ్డి మూవీలో అఖిల్ కి జోడిగా ఉప్పెన బ్యూటీ పేరు తెరమీదకి వచ్చింది. అఖిల్, కృతి శెట్టినే సజెస్ట్ చేస్తున్నాడట. మరోపక్క మరో యంగ్ హీరో నాగ శౌర్య కుడా తాను కొత్తగా మొదలు పెట్టబోయే మూవీ లో కృతి శెట్టి ని హీరోయిన్ గా పరిశీలంచబోతున్నారట. మరి ఉప్పెన సినిమాలో కృతి లుక్స్ మీద ట్రైలర్ తో ఓ ఐడియాకి వచ్చినవారు.. ప్రస్తుతం ట్రెడిషనల్ గా ఆకట్టుకుంటున్న ఆమె గ్లామర్ గా ఎలా ఉంటుంది. అసలు ఉప్పెన సినిమా హిట్టా.. ఫట్టా అనేది పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కృతీ శెట్టి లుక్స్ నే చూస్తున్నారు యంగ్ హీరోలు. అందుకే ఉప్పెన రిసల్ట్ తో పని లేకుండా అందరూ కృతి శెట్టి ని లాక్ చేసే పనిలో ఉన్నారట.
- Tags
- Kruthi Shetty