Mon Dec 23 2024 12:15:49 GMT+0000 (Coordinated Universal Time)
Balakrishna : ఎవరైనా నవ్వితే బాలయ్య తట్టుకోలేడు.. డైరెక్టర్ వైరల్ కామెంట్స్..
ఎవరైనా నవ్వితే బాలయ్య తట్టుకోలేడు అంటూ తమిళ దర్శకుడు బాలయ్య ప్రవర్తన గురించి హేళనగా మాట్లాడారు.
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ.. తన అభిమానులను కొడుతూ ఉంటారని అందరికి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే బాలయ్య అలా కొట్టాడని కొందరు దర్శకనిర్మాతలతో పాటు కొందరు యాక్టర్స్ కూడా సమర్థిస్తారు.
కానీ తాజాగా ఓ తమిళ దర్శకుడు బాలయ్య ప్రవర్తన గురించి హేళనగా మాట్లాడారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన కెఎస్ రవికుమార్.. తెలుగులో చిరంజీవి, బాలయ్యతో కూడా సినిమాలు చేశారు. బాలకృష్ణ రూలర్, జైసింహా సినిమాలను ఈ దర్శకుడే తెరకెక్కించారు.
తాజాగా ఓ తమిళ మూవీ ఈవెంట్ లో ఈ దర్శకుడు బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ ముందు ఎవరైనా నవ్వితే ఆయనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నేను ఆయనతో రూలర్ మూవీ తెరకెక్కిస్తున్నప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన విగ్గుని చూసి నవ్వాడు. దీంతో ఆయనకి కోపం వచ్చేసి, వాడిని కొట్టబోయారు. నేను ఆయనని అడ్డుకొని, తను నా అసిస్టెంట్ డైరెక్టర్ అని ఆయనకి సర్ది చెప్పాను. అప్పుడు బాలయ్య నాతో ఇలా అన్నారు.. వాడు మన ఆపోజిట్ గ్యాంగ్. వాడిని అస్సలు వదలకూడదు" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ కామెంట్స్ పై బాలయ్య అభిమానులతో పాటు కొందరు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దర్శకుడికి బాలయ్య రెండుసార్లు అవకాశం ఇచ్చారు. అది కూడా ఆ దర్శకుడు ప్లాప్స్ లో ఉన్న సమయంలో అవకాశం ఇచ్చారు. కానీ ఆ దర్శకుడు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆయన సారీ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో కెఎస్ రవికుమార్ రియాక్ట్ అవుతారేమో చూడాలి.
Next Story