Mon Dec 23 2024 05:41:26 GMT+0000 (Coordinated Universal Time)
లాభాల బాట పట్టేసిన 'ఖుషీ'
విజయ్ దేవరకొండ మరోసారి సక్సెస్ బాట పట్టాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందిన
విజయ్ దేవరకొండ మరోసారి సక్సెస్ బాట పట్టాడు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఖుషి’ కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.70.23 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘ఖుషి’.. రెండు రోజుల్లో రూ.51 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మూడు రోజుల్లో రూ.70 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రికవరీ 60 శాతం పైగా వెళ్ళింది. ఓవర్సీస్లో ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో కలుపుకుని మూడు రోజుల్లో యూఎస్‌లో ‘ఖుషి’ 1.4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ‘నిన్నుకోరి’, ‘మజిలీ’ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. తన గత చిత్రాలకు భిన్నంగా శివ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు ముందు నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి హైప్ నెలకొంది. దానికి తగ్గట్లే పాటలు, ట్రైలర్ ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. దానికి తగ్గట్లే సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ వీకెండ్ ను ఖుషీని జనం బాగా ఆదరించారు.
Next Story