వంద కుటుంబాలకు రూ.1లక్ష చెక్ అందించిన విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండ తన ఇచ్చిన మాటని నిలబెట్టుకొని వంద కుటుంబాలకు రూ.1లక్ష అందజేశాడు.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన 'ఖుషి' (Kushi) మంచి విజయం అందుకోవడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు. ఇక ఆ ఆనందంతో వందమంది అభిమానుల కుటుంబాలను ఎంపిక చేసి ఫ్యామిలీ ఒక లక్ష చొప్పున అందజేస్తాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ తన మాటని నిలబెట్టుకున్నాడు. ఇటీవల 100 కుటుంబాలను ఎంపిక చేయడానికి ఒక గూగుల్ అప్లికేషన్ ని విడుదల చేసిన విజయ్.. వచ్చిన అప్లికేషన్స్ అన్నిటిని పరిశీలించి కొంతమందిని ఎంపిక చేశాడు.
ఇక ఆ సెలెక్ట్ చేసిన వంద కుటుంబాల లిస్ట్ ని కూడా ఇటీవల విజయ్ రిలీజ్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కూడా ఎంపిక చేశాడు. తాజాగా ఆ ఫ్యామిలీస్ అన్నిటికి హైదరాబాద్ లో లక్ష రూపాయిల చెక్ ని అందజేశాడు. ఖుషి అనే ఒక ఈవెంట్ ని కండక్ట్ చేసి.. ఎంపికైన కుటుంబాలకు తన చేతులు మీదుగా చెక్ ని అందజేశాడు. ఇక ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని విజయ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.
ఈ లక్ష రూపాయిలు పంచడంతో తాను కూడా ఫుల్ ఖుషి అయ్యినట్లు పేర్కొన్నాడు. తాను ఆరోగ్యంగా ఉన్నంత కాలం, సంపాదిస్తునంత కాలం.. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమం ఏదోకటి చేస్తూనే ఉంటాను అంటూ వెల్లడించాడు. కాగా ఆ మధ్య వందమంది అభిమానులను సెలెక్ట్ చేసి దేవరశాంటా పేరుతో హాలీవుడ్ ట్రిప్ కి పంపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పనులతో విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ వస్తుంది.
ఇప్పటి వరకు ఏ ఇండస్ట్రీకి సంబంధించిన హీరో ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. దీంతో ఇతర హీరో అభిమానులకు, ఇతర పరిశ్రమ ఆడియన్స్ ని విజయ్ ఆకర్షిస్తున్నాడు. ఇటీవల ఖుషి సినిమాకి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈ ఏడాది టాప్ తెలుగు మూవీగా నిలిచింది.