Fri Dec 20 2024 06:54:51 GMT+0000 (Coordinated Universal Time)
Rajinikanth : ఉదయానే అభిమాని ఇంటికి రజినీకాంత్.. వీడియో చూశారా..
రజినీకాంత్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రజిని ఉదయానే ఒక అభిమాని ఇంటికి అతిథిగా వెళ్లి..
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ హీరో లాల్ సలామ్, తలైవర్ 170 సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో లాల్ సలామ్ షూటింగ్ ని పూర్తి చేసేసిన రజిని.. ప్రస్తుతం తలైవర్ 170 షూటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు. ఇటీవలే ముంబై షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ.. చెన్నై షెడ్యూల్ ని కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది.
ఇది ఇలా ఉంటే, రజినీకాంత్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో రజిని ఉదయానే ఒక అభిమాని ఇంటికి అతిథిగా వెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో అమెరికా టూర్ కి వెళ్లిన రజిని.. ఒకరోజు మార్నింగ్ వాక్ లో తమిళ్ ఫ్యామిలీని కలుసుకున్నారు. అమెరికాలో ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి ముందు నుంచి రజిని వెళ్తుండగా.. ఆ ఫ్యామిలీ గమనించి రజినీకాంత్ ని పలకరించారు.
రజినిని చూడగానే ఇంటిలో ఉన్న ఇతర కుటుంబసభ్యులు కూడా బయటకి వచ్చేశారు. వారందరికీ ఆయనను తమ ఇంటిలోకి ఆహ్వానించాలని ఉన్నా.. అడగడానికి భయంతో సంకోచిస్తున్నారు. వారి భయాన్ని గమనించిన రజిని.. "తానే ఆ కుటుంబంతో నేను మీ ఇంటిలోకి రానా" అంటూ అడిగారు. దీంతో ఆ ఫ్యామిలీ సంతోషం ఉప్పొంగిపోయి రజినిని తన ఇంటిలోకి ఆహ్వానించారు. రజిని రాకతో అందరూ ఉదయానే నిద్ర లేచి కల నిజమో అనే ఆశ్చర్యంలో ఉన్నారు.
ఇక వారిని చూసిన రజినీకాంత్.. నేను మీ నిద్ర చెడగొట్టినట్లు ఉన్నాను అంటూ అడిగిన వైనం నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. అలాగే ఆ కుటుంబంలోని చిన్న వారితో కూడా రజిని వినయపూర్వకంగా మాట్లాడుతుంటే అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్.. రజినికాంత్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ వీడియోని మీరుకూడా ఒకసారి చూసేయండి.
Next Story