Fri Jan 10 2025 23:46:25 GMT+0000 (Coordinated Universal Time)
58 ఏళ్ల వయసులో గర్భవతి అయిన సిద్ధూ తల్లి
పంజాబీ గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు తమ రెండో బిడ్డ కోసం
పంజాబీ గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూస్ వాలా తల్లిదండ్రులు తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. మూస్ వాలా తల్లి చరణ్ కౌర్ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తోంది. చరణ్ కౌర్ వయసు దాదాపు 58 ఏళ్లు కాగా, సిద్ధూ తండ్రి వయసు 60 ఏళ్లు. సిద్ధూ మూస్ వాలా తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతని తల్లిదండ్రులు ఎటువంటి అధికారిక ప్రకటనను విడుదల చేయనప్పటికీ.. డెలివరీ టైమ్ దగ్గరకు వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2022 మేలో జరిగిన అతడి హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దూ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడు సిద్దూ తల్లి చరణ్ సింగ్ 58 ఏళ్ల వయసులో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమైంది. ఐవీఎఫ్ ద్వారా మరో గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే ఆమె బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె ప్రసవం కోసం సిద్ధమవుతుండటంతో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.
సిద్దూ మూసేవాలాను మే 29, 2022లో పంజాబ్లోని మాన్సా జిల్లాలో కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కేసులో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయి, గోల్డీ బ్రార్, జగ్గూ భగ్వాన్పూరియా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సిద్దూ మూసేవాలాను తానే హత్య చేసినట్లు గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ విచారణలో అంగీకరించాడు. చనిపోయే నాటికి సిద్ధూ వయసు 28 సంవత్సరాలు.
Next Story