సమంత ఎందుకిలా చేస్తుంది
అక్కినేని కోడలిగా అక్కినేని ఇంట కాలు పెట్టిన సమంత ఆ ఇంటితో అనుబంధాన్ని, చైతు తో తనకున్న ప్రేమని, నాగ్ – అమల -ఆఖిల్ తో తనకున్న [more]
అక్కినేని కోడలిగా అక్కినేని ఇంట కాలు పెట్టిన సమంత ఆ ఇంటితో అనుబంధాన్ని, చైతు తో తనకున్న ప్రేమని, నాగ్ – అమల -ఆఖిల్ తో తనకున్న [more]
అక్కినేని కోడలిగా అక్కినేని ఇంట కాలు పెట్టిన సమంత ఆ ఇంటితో అనుబంధాన్ని, చైతు తో తనకున్న ప్రేమని, నాగ్ – అమల -ఆఖిల్ తో తనకున్న అనుబంధాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అయితే సమంత ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో వరసగా మిస్ అవడం మాత్రం అక్కినేని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వెంకిమామ తో చైతు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వెంకిమామ ట్రైలర్ ని చూడండి అంటూ అప్పుడెప్పుడో… సోషల్ మీడియాలో స్పందించిన సమంత… తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన అక్కినేని అవార్డు ఫంక్షన్ కి రాలేదు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం పిల్లా పెద్ద అంతా అక్కినేని అవార్డు ఫంక్షన్ లో మెరవగా అక్కడ సమంత లేని లోటు స్పష్టంగా తెలిసింది.
తాజాగా మరోసారి అక్కినేని ఫ్యామిలీ పిక్ లో సమంత మిస్ అయ్యింది. అక్కినేని నాగేశ్వర రావు పెద్ద కొడుకు అక్కినేని వెంకట్ ఇంట జరిగిన నిశ్చితార్ధ వేడుకకు సమంత హాజరు కాలేదనే విషయం అక్కినేని ఫ్యామిలీ పిక్ చూస్తే తెలుస్తుంది. వెంకట్ కొడుకు నిశ్చితార్ధ వేడుక చెన్నైలో జరగడంతో.. ఆ వేడుకకి నాగార్జున కుటుంబమంతా వెళ్లినా సమంత మాత్రం అక్కడ కనబడలేదు. చైతు, అఖిల్ సుమంత్, సుశాంత్, అమల ఇలా అంతా ఉన్నా ఆ పిక్ లో సమంత లేని లోటు కనబడుతుంది. అయితే సమంత ద ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ షూటింగ్ తో బిజీగా ఉండడం వలన రాలేదా? ఇంకేమన్నానా? అని అభిమానులు ఒకింత కంగారు పడుతున్నారు. ఎంత షూటింగ్ లో ఉన్నా ఒక్కరోజు సమంత కి వీలు కాలేదా? అంటూ దీర్ఘాలు తీసేవాళ్లూ ఉన్నారు.
- Tags
- సమà°à°¤