Mon Dec 23 2024 16:11:34 GMT+0000 (Coordinated Universal Time)
వరుణలావణ్యం.. ఏడేళ్ల ప్రేమకు నిశ్చితార్థం
లావణ్య-వరుణ్ లు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. నిన్నమొన్నటి వరకూ అంతరిక్షం సినిమా నుంచి..
వెండితెరపై హీరో, హీరోయిన్ గా కనువిందు చేసిన జంట.. నిజ జీవితంలో దంపతులు కాబోతున్నారు. శుక్రవారం రాత్రి వరుణ్ - లావణ్య ల నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్ గా జరిగింది. "అందాల రాక్షసి"లో "నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న" అనే డైలాగ్ తో పాపులర్ అయిన లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా విజయాలు పెద్దగా రాలేదు. లావణ్య సినిమా కెరీర్ లో భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇటీవల మేక-పులి వెబ్ సిరీస్ విజయవంతమైంది. ఇందులో లావణ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది.
కాగా..లావణ్య-వరుణ్ లు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. నిన్నమొన్నటి వరకూ అంతరిక్షం సినిమా నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ.. నిశ్చితార్థం తర్వాత లావణ్య పోస్ట్ చేసిన ఫొటోల కింద రాసిన దానిని బట్టి 2016 నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మిస్టర్ సినిమా షూటింగ్ నుంచీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్పిందీ అందాల రాక్షసి. ఇక వరుణ్ తేజ్ "నా ప్రేమను దక్కించుకున్నా" అంటూ ఎంగేజ్ మెంట్ ఫోటోలు షేర్ చేశాడు.
వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్ లతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మీడియాకు కూడా ప్రవేశం లేదు. మరో రెండు నెలల్లో వీరివివాహం జరగనున్నట్లు సమాచారం. ఏడేళ్ల ప్రేమకు త్వరలోనే ఏడడుగులు పడనున్నాయి. కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో పాటు.. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. త్వరలోనే కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా కూడా చేయనున్నారు.
Next Story