Mon Dec 23 2024 15:38:08 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్ళికి ముందే అత్తారింట్లో లావణ్య.. వినాయక చవితి వేడుక..
పెళ్ళికి ముందే లావణ్య త్రిపాఠి అత్తవారి ఇంటి పూజ గదిలోకి అడుగు పెట్టి వినాయక చవితి వేడుకను..
టాలీవుడ్ హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. జూన్ లో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని పెళ్లికి సిద్ధంగా ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. ఈ మెగా వెడ్డింగ్ నవంబర్ నెలలో జరగబోతుంది అంటూ ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పెళ్లి చేసుకొని అత్తారింట్లోకి అడుగు పెట్టడానికి కంటే ముందే.. లావణ్య అత్తవారి ఇంట దీపం వెలిగించేస్తుంది.
నేడు వినాయక చవితి సందర్భంగా సెలబ్రిటీస్ అంతా విషెస్ తెలియజేస్తూ.. తమ ఫెస్టివల్ సెలబ్రేషన్ పిక్స్ ని షేర్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే వరుణ్ కూడా తమ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడుకల ఫోటోలను షేర్ చేశాడు. అయితే ఈ ఫొటోల్లో నాగబాబు దంపతులతో పాటు వరుణ్ అండ్ లావణ్య కూడా వినాయక పూజలో పాల్గొని కనిపిస్తున్నారు. పెళ్ళికి ముందే లావణ్య అత్తవారి ఇంటి పూజ గదిలోకి అడుగు పెట్టేయడంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే, ఈ జంట ఇటీవలే పెళ్లికి సంబంధించిన షాపింగ్ ని కూడా మొదలు పెట్టేశారు. బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో.. ఈ మెగా వెడ్డింగ్ కోసం ప్రత్యేకంగా పెళ్లి బట్టలను డిజైన్ చేయించబోతున్నారు. ఇక నిశ్చితార్థం వేడుకను కేవలం ఇరు కుటుంబాల మధ్యనే జరుపుకున్న ఈ జంట.. పెళ్లిని కూడా అలాగే చేసుకోబోతున్నారు. ఇటలీలో ఈ మెగా వెడ్డింగ్ జరగనున్నట్లు సమాచారం.
కాగా వరుణ్ అండ్ లావణ్య మొదటిసారి 'మిస్టర్' సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడం, అది మూవీ పూర్తి అయిన తరువాత కూడా కొనసాగడంతో ప్రేమగా మారింది. మళ్ళీ రెండోసారి 'అంతరిక్షం' సినిమాలో నటించే సమయానికి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. అప్పటి నుండి ఆ ప్రేమని సీక్రెట్ గానే మెయిన్టైన్ చేస్తూ వచ్చిన ఈ జంట ఎంగేజ్మెంట్ తరువాత అందరికి తెలియజేశారు.
Next Story