Sat Nov 16 2024 23:24:02 GMT+0000 (Coordinated Universal Time)
సిరివెన్నెల తో రాజమౌళి జ్ఞాపకం
సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుర్తు చేసుకున్నారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుర్తు చేసుకున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం సిరివెన్నెల పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. రాజమౌళి దాదాపు రెండు దశాబ్దాల క్రితం జిరిగిన ఘటన గుర్తు చేసుకున్నారు. ట్వీట్ చేశారు. " 1996లో మేము అర్థాంగి సినిమాతో సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చింది "ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి" అనే పదాలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. భయం వేసినప్పుడల్లా ఆ పదాలు గుర్తు తెచ్చుకుని పాడుకునే వాడిని."
ఆయన ఇంటికి వెళ్లి...
" అప్పటికి నాకు శాస్త్రిగారితో అంతగా పరిచయం లేదు. మద్రాసులో డిసెంబరు 31వ తేదీ రాత్రి పదిగంటలక ఆయన ఇంటికి వెళ్లాను. ఏం కావాలి నందీ అని అడిగారు. ఒక కొత్త నోట్ బుక్ ఆయన చేతికిచ్చి మీ చేతులతో ఆ పాట రాసివ్వమని అడిగాను. రాసి, ఆయన సంతకం పెట్టి ఇచ్చారు. జనవరి 1న మా నాన్నగారికి గిఫ్ట్ ఇచ్చాను. ఆయన కళ్లల్లో ఆనంద, మాటల్లో కొత్తగా ఎగదన్నుకొచ్చిన విశ్వాసాన్ని ఎప్పటికీ మరిచిపోలేను." అని దర్శకుడు రాజమౌళి గుర్తు చేసుకున్నారు.
Next Story