Mon Dec 23 2024 20:18:29 GMT+0000 (Coordinated Universal Time)
సీతారామం దుల్కర్ సల్మాన్ కుటుంబంలో విషాదం
సీతారామంతో తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన దుల్కర్ సల్మాన్ కుటుంబంలో
సీతారామంతో తెలుగు ప్రజల హృదయాలను కొల్లగొట్టిన దుల్కర్ సల్మాన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దుల్కర్ తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరో అనే సంగతి తెలిసిందే..! ఆయన సోదరి చనిపోయారు. మమ్ముట్టి సోదరి అమీనా కన్నుమూశారు. ఆమె వయసు 70. గత కొంతకాలంగా ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆమె కంజిరపల్లి పరాయిక్కల్ కుటుంబానికి చెందిన దివంగత సలీమ్ భార్య. ఆమెను నసీమా అని కూడా పిలిచేవారు. బుధవారం (సెప్టెంబర్ 13) అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ ఏడాదిలోనే మమ్ముట్టి కుటుంబంలో పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆమె తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించారు. తాజాగా సోదరి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్నారు.
Next Story