Tue Jan 14 2025 11:53:47 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. భారీ ఓపెనింగ్స్ కానీ మధ్యాహ్నానికే డీలా
మధ్యాహ్నానికి లైగర్ పై నెగిటివ్ రివ్యూలు రాగా.. ఈ వారాంతం లైగర్ కు కష్టమేనంటున్నారు సినీ క్రిటిక్స్. నేటి ప్రేక్షకుడు మెచ్చేలా లైగర్..
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కాంబినేషన్లో గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా లైగర్. రౌడీ హీరో నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో.. లైగర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. బాక్సాఫీస్ వద్ద లైగర్ కు గ్రాండ్ వెల్ కమ్ లభించింది. కానీ బెనిఫిట్, మార్నింగ్ షోల తర్వాత సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో మధ్యాహ్నానికే డీలా పడింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం లైగర్ తొలిరోజు రూ.20-25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. లైగర్ హిందీ వెర్షన్ విడుదల కావడం కాస్త ఆలస్యమైంది. అయితే ఎందుకు ఆలస్యమైందన్న విషయం తెలియలేదు.
మధ్యాహ్నానికి లైగర్ పై నెగిటివ్ రివ్యూలు రాగా.. ఈ వారాంతం లైగర్ కు కష్టమేనంటున్నారు సినీ క్రిటిక్స్. నేటి ప్రేక్షకుడు మెచ్చేలా లైగర్ కథ లేకపోవడం ఒక కారణమైతే.. లైగర్ పూర్తి సినిమా ఏదో బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసినట్లుగా అనిపించడం మరో మైనస్ అని చెప్పాలి. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాను జనాల్లోకి తీసుకెళ్లడంలో చిత్రబృందం సక్సెస్ అయింది కానీ.. బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ మౌత్ టాక్ రావడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, మకరంద్ దేశ్పాండే, అలీ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రల్లో నటించారు. లైగర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్, పూరీ సహా.. చిత్రబృందమంతా నెగిటివ్ టాక్ తో నిరాశపడుతున్నారు.
Next Story