Mon Dec 23 2024 00:37:35 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ ఫస్ట్ గ్లింప్స్.. మునుపెన్నడూ లేని ఎంట్రీతో విజయ్ దేవరకొండ !
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈలోగా విజయ్ అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా
రొమాంటిక్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ - అనన్య పాండే జంటగా.. మైక్ టైసన్ ప్రధాన పాత్రలో వస్తోన్న పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ లైగర్. దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈలోగా విజయ్ అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా వరుస అప్ డేట్స్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం లైగర్ బీటీఎస్ పిక్స్, ఇన్స్టా ఫిల్టర్ ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
ముంబై ఛాయ్ వాలా టు ఎంఎంఏ ఛాంపియన్
53 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ.. మునుపెన్నడూ చూడనంత పవర్ ఫుల్ గెటప్ లో కనిపించాడు. పూరీ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో రౌడీ బాయ్ పవర్ ఫుల్ డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై హైప్ ని పెంచేస్తున్నాయి. ఫస్ట్ గ్లింప్స్ తో రౌడీ బాయ్స్ లైగర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పోనీ టైల్ తో సరికొత్త లుక్ లో కనిపించాడు విజయ్ దేవరకొండ. ముంబై వీధుల్లో ఛాయ్ వాలాగా ఉండే ఓ కుర్రాడు.. ఎంఎంఏ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడన్నది సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. అలాగే కన్నడ, తమిళం, మళయాళంలో డబ్ చేయనున్నారు. లైగర్ సినిమాలో విజయ్ కు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించినట్లు తెలుస్తోంది. అలాగే రోనిత్ రాయ్, మకరంద్ దేశ్ పాండే కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు.
Next Story