Fri Nov 22 2024 22:32:28 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ కు UA సర్టిఫికేట్.. సినిమా ఎలా ఉందన్నారంటే..?
లైగర్ కు UA సర్టిఫికేట్.. సినిమా ఎలా ఉందన్నారంటే..?
సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా లైగర్. విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కిన మూవీ 'లైగర్'. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ తొలిసారి ఓ ఇండియన్ ఫిల్మ్ లో నటించడం విశేషం.
'లైగర్' సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తీ అయిపోయాయి. ఈ సినిమాకు UA సర్టిఫికేట్ను అందించారు. సినిమా రన్టైమ్ 2 గంటల 20 నిమిషాలు, మొదటి సగం 1 గంట 15 నిమిషాలు- రెండవ సగం 1 గంట 5 నిమిషాలు ఉందని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారని సమాచారం. యాక్షన్ పార్ట్ బాగా వచ్చిందని.. మదర్ సెంటిమెంట్ బాగుందని చెప్పినట్లు తెలిపాయి. ఈ సినిమాలో ఏడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది.
చాయ్ వాలా నుంచి ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎదిగిన పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటిస్తోంది. మూవీ ప్రమోషన్స్ ను బాగా చేస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మిగతా భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. లైగర్ పాటలకూ మంచి స్పందన లభిస్తోంది.
Next Story