Mon Dec 23 2024 02:35:04 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ ఫస్ట్ రివ్యూ.. ఉమైర్ సంధూ ఏం చెప్పారు ?
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించగా..
విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించగా.. ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే విజయ్ పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ కు వెళ్లడం ఖాయమని ఇప్పటికే సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ సినిమాపై ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూని ట్విట్టర్ ద్వారా తెలిపారు. లైగర్ ఫస్ట్ రివ్యూలో సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని తెలుస్తోంది. 'విజిల్స్ వేసే మాస్ ఎంటర్టయినర్ 'లైగర్'. విజయ్ దేవరకొండ వన్ మేన్ షో చేశాడు. షో మొత్తాన్ని ఆయన దోచేశాడు. టెర్రిఫిక్ యాక్షన్ స్టంట్స్. డైరెక్షన్ అదిరిపోయింది. ఈ సినిమాలో రమ్యకృష్ణది ఒక సర్ ప్రైజ్ ప్యాకేజ్. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్ గా ఉన్నాయి' అని ఉమైర్ సంధు తన రివ్యూను ఇచ్చారు.
Next Story