Mon Dec 23 2024 05:14:02 GMT+0000 (Coordinated Universal Time)
Liger OTT.. లైగర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
సినిమా థియేటర్స్ లో విడుదల కంటే ముందే ఓటీటీతో మంచి డీల్ ను కుదుర్చుకుంది.
విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్' సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. భారతదేశంలోనూ ఓవర్సీస్ లోనూ భారీ స్థాయిలో సినిమా విడుదలైంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల కాగా, హిందీ వెర్షన్ ఈరోజు రాత్రి నుంచి థియేటర్లలో ఆడనుంది. రేపు ఉదయం నుంచి ఈ సినిమా హిందీ, తెలుగు రెండు వెర్షన్లకు రెగ్యులర్ షోలు వేయనున్నారు.
సినిమా థియేటర్స్ లో విడుదల కంటే ముందే ఓటీటీతో మంచి డీల్ ను కుదుర్చుకుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్స్టార్కు విక్రయించారు. ఈ చిత్రం డిజిటల్ హక్కుల కోసం నిర్మాతలు భారీ మొత్తాన్ని అందుకున్నారని కథనాలు రాగా.. అసలు ధర ఎంతనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కు సంబంధించిన ఖచ్చితమైన తేదీ గురించి ఇంకా తెలియలేదు. అయితే సినిమా హిట్ టాక్ ను బట్టి ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని నిర్మాతల సంఘం.. కొత్త సినిమాలు OTT విడుదల కావాలంటే థియేటర్లలో ఎనిమిది వారాల విండోను కలిగి ఉండాలని నిర్ణయించింది. దీన్ని బట్టి అక్టోబర్లో 'లైగర్' డిస్నీ+ హాట్స్టార్లో ప్రసారం అవుతుందని భావిస్తున్నారు. డిస్నీ+ హాట్స్టార్ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి భారీ మొత్తాన్ని చెల్లించింది. ఇక సినిమా మీద భారీగా బజ్ ఉండడం.. వినాయక చవితి హాలిడేస్ కూడా కలిసి వస్తూ ఉండడంతో సినిమాకు కలెక్షన్స్ భారీగానే ఉండనున్నాయి.
Next Story