Sat Dec 28 2024 04:23:06 GMT+0000 (Coordinated Universal Time)
పాన్ ఇండియా హీరో, హీరోయిన్ల జాబితా : ఆ స్థానాల్లో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, సమంత
ఆగస్ట్ 2022 వరకు పాన్ ఇండియా లెవెల్లో తీసుకున్న గణాంకాల ఆధారంగా ఓర్ మ్యాక్స్ ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ వన్ స్థానంలో..
నిన్న మొన్నటి వరకూ సినిమా ఏ భాషలో రూపొందితే ఆ భాషలోనే విడుదలయ్యేది. కానీ బాహుబలి తో సౌత్ సినిమా సత్తాన్ని చాటారు రాజమౌళి. దాంతో సౌత్ సినిమా సరిహద్దులు చెరిగిపోయి.. ఇండియా మొత్తం తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు భాషలకు అతీతంగా కంటెంట్ ఉన్న ఏ సినిమానైనా ఆదరించే పరిస్థితి వచ్చింది. జనాలకు ఓటీటీలు అందుబాటులోకి రావడంతో.. అన్ని భాషా చిత్రాలను వీక్షించడానికి అలవాటు పడ్డారు.
దక్షిణాదిలో రూపొందుతున్న సినిమాలు ఉత్తరాది బాక్సాఫీస్ లను కూడా ఓ ఊపు ఊపుతున్నాయి. బాలీవుడ్ సినిమాలనే ఆదరించని నార్త్ ప్రేక్షకులు సౌత్ సినిమాలను ఆదరిస్తుండటం విశేషం. ఈ క్రమంలో దక్షిణాది స్టార్లకు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఓర్ మ్యాక్స్ దేశంలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్ సర్వేన నిర్వహించింది. ఈ జాబితాలో టాప్ స్థానాలను దక్షిణాది హీరోలే ఆక్రమించారు.
ఆగస్ట్ 2022 వరకు పాన్ ఇండియా లెవెల్లో తీసుకున్న గణాంకాల ఆధారంగా ఓర్ మ్యాక్స్ ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ వన్ స్థానంలో తమిళ స్టార్ విజయ్ నిలిచారు. రెండో స్థానంలో ప్రభాస్, మూడో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఐదో స్థానాన్ని కన్నడ స్టార్ యశ్ ఆక్రమించారు. బాలీవుడ్ కు ఆరో స్థానం దక్కడం గమనార్హం. ఆరో స్థానంలో బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రామ్ చరణ్, మహేశ్ బాబు, సూర్య, అజిత్ ఉన్నారు.
ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. పాన్ ఇండియా టాప్ హీరోయిన్ల లిస్ట్ లో సమంత మొదటి స్థానం కొట్టేసింది. రెండవ స్థానంలో ఆలియాభట్, మూడవ స్థానంలో నయనతార, నాల్గవ స్థానంలో కాజల్ అగర్వాల్, ఐదవ స్థానంలో దీపికా పదుకొనే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రష్మిక మందన్న, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, పూజా హెగ్డే, అనుష్క ఉన్నారు. టాప్ 10 హీరోయిన్ల స్థానాల్లో రెండు స్థానాలతో సరిపెట్టుకుంది బాలీవుడ్.
Next Story