Mon Dec 23 2024 10:29:58 GMT+0000 (Coordinated Universal Time)
మరో ట్వీట్ చేసిన మంచు మనోజ్
తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. కానీ అప్పటికే..
మంచువారింట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు తీవ్రదుమారం రేపిన విషయం తెలిసిందే. విష్ణు తీరుపై నిన్న మంచు మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది తీవ్ర కలకలం రేపింది. తండ్రి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మనోజ్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశారు. కానీ అప్పటికే వీడియోను నెటిజన్లు డౌన్లోడ్ చేసుకోవడంతో.. అది బాగా వైరల్ అయింది. అయితే ఆ వీడియోపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఇదేమంత పెద్ద గొడవ కాదని, మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయమని చెప్పుకొచ్చారు. అంతటితో ఆ వివాదానికి తెరపడింది.
తాజాగా.. మంచు మనోజ్ మరో ట్వీట్ చేశారు. ‘‘బతకండి.. బతకనివ్వండి. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. కొటేషన్స్ ఉన్న మరో రెండు ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘‘అన్ని తప్పులను చూస్తూ పట్టించుకోకుండా జీవించడం కంటే.. సరైన దాని కోసం పోరాడుతూ చనిపోతాను’’ అని అమెరికన్ రచయిత సుజీ కాసెమ్ చేసిన వ్యాఖ్యలను మనోజ్ ఈ ట్వీట్ లో జత చేశారు. ‘‘క్రియేటివిటీకి నెగిటివిటీనే పెద్ద శత్రువు’’ అంటూ అమెరికన్ ఫిల్మ్ మేకర్ డేవిడ్ లించ్ చేసిన వ్యాఖ్యలను కూడా మనోజ్ కోట్ చేశారు. అన్నదమ్ముల మధ్య గొడవ తర్వాతి రోజే మనోజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Next Story