Mon Dec 23 2024 08:14:15 GMT+0000 (Coordinated Universal Time)
మూడు వెర్షన్లో రిలీజైన లియో.. మీరు ఏది చూశారు..?
లియో సినిమా క్లైమాక్స్ మూడు వెర్షన్స్ తో రిలీజ్ అయ్యిందట. ఒక్కోచోట ఒక్కో క్లైమాక్స్ ఎండింగ్‌తో..
తమిళ హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ 'లియో'. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో అర్జున్ సర్జా, సంజయ్ దత్, త్రిష.. వంటి స్టార్ క్యాస్ట్ నటించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని అనుకునంత సంతృప్తి పరచలేకపోయింది. అయినా కలెక్షన్స్ విషయంలో మాత్రం యమా దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది.
ఇది ఇలా ఉంటే, ఈ సినిమా విషయంలో ఆడియన్స్ ఒక విషయం గమనించారు. ఈ సినిమా క్లైమాక్స్ మూడు వెర్షన్స్ తో రిలీజ్ అయ్యిందట. ఒక్కోచోట ఒక్కో క్లైమాక్స్ ఎండింగ్ తో లియోని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది. తమిళ్, తెలుగులో మీరు చూసిన క్లైమాక్స్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ మ్యాన్ అయిన హీరోనే 'లియో' అని అర్జున్‌కి, సంజయ్ దత్‌కి చనిపోయే ముందు తెలుస్తుంది. ఈ రెండు సీన్స్ ని మూవీ క్లైమాక్స్ లో ఒకేసారి చూపిస్తారు.
ఇక అమెరికాలో రిలీజ్ అయిన వెర్షన్ విషయానికి వస్తే.. హీరోనే 'లియో' అని అర్జున్‌కి తెలుస్తుంది గాని, సంజయ్ దత్ కి మాత్రం తెలియదు. మలేషియాతో పాటు మరికొన్ని చోట్ల.. సంజయ్ దత్‌ని చంపేసేటప్పుడు హీరోనే లియో అని తెలియజేసి, అర్జున్‌ని చంపేందుకు లియోనే వెళ్లినట్లు చూపించారట. మరి ఇలా డిఫరెంట్ క్లైమాక్స్ లతో రిలీజ్ చేయడం వెనుక కారణం ఏమన్నా ఉందా..? అనేది లోకేష్ కానగరాజ్ నుంచి తెలియాల్సి ఉంది.
అలాగే ఈ సినిమా గురించి మరో విషయం కూడా వైరల్ అవుతుంది. ఇటీవల లియో మూవీ కెమెరామెన్ మనోజ్ పరమహంస ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "సినిమాలోని లియో ఫ్లాష్ బ్యాక్ అబద్దం అయ్యుండొచ్చని, ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసిన ఖైదీ లియోకి సంబంధించిన కథని మార్చి చెప్పి ఉండొచ్చని" అంటూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో దర్శకుడు లోకేష్ LCU పై మరింత ఆసక్తి పెరుగుతుంది.
Next Story