Thu Dec 19 2024 15:27:14 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప 2 సెట్స్‌లో 100కు పైగా లారీలు.. పోస్టు వైరల్..
పుష్ప 2 సెట్స్ లోని వీడియో అంటూ ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 100 పైగా లారీలు ఉన్న..
ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో 'పుష్ప' సృష్టించిన మ్యానియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని అల్లు అర్జున్ (Allu Arjun) డైలాగ్స్, మ్యానరిజమ్స్, డాన్స్ స్టెప్స్ వరల్డ్ వైడ్ గా ఫేమ్ ని సంపాదించుకున్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కి ఇంతటి క్రేజ్ రావడంతో సెకండ్ పార్ట్ పై నార్మల్ గానే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇటీవల ఈ మూవీకి బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ క్యాటగిరీల్లో రెండు నేషనల్ అవార్డులు రావడంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ అంచనాలకు తగ్గట్టే సుకుమార్ కూడా సెకండ్ పార్ట్ ని ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో ఎమోషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ భారీగా ఉంటాయని సుకుమార్ ఇప్పటికే తెలియజేసిన సంగతి అందరికి తెలిసిందే.
ఈనేపథ్యంలోనే సినిమాలో పలు ఛేజింగ్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయి. ఎర్రచందనం లోడ్ ఉన్న లారీలతో సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు చూపించబోతున్నారు. ఆ మధ్య నదిలో ఒక ఛేజ్ సీన్ ని తెరకెక్కిస్తుండగా అందుకు సంబంధించిన ఒక వీడియో బయటకి వచ్చింది. అలాగే సెట్స్ నుంచి ఎర్రచందనం లోడ్ లారీలతో ఉన్న అనేక వీడియోలు నెట్టింట కనిపిస్తూ వచ్చాయి.
తాజాగా సరికొత్త ఫోటోలు అండ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారాయి. ఒక గ్రౌండ్ లో దాదాపు 100 పైగా లారీలు ఉన్న ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం సుకుమార్ ఈ లారీలను తెప్పించినట్లు నెట్టింట చర్చ నడుస్తుంది. ఇక పుష్ప 2 (Pushpa 2) సెట్స్ లో ఇన్ని లారీలను చూసిన నెటిజెన్స్.. అసలు సుకుమార్ ఏ రేంజ్ లో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నాడో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Next Story