Sun Dec 22 2024 17:16:55 GMT+0000 (Coordinated Universal Time)
తాజ్ మహల్ ను సందర్శించిన లవ్ బర్డ్స్
రకుల్, జాకీ భగ్నానీ తాజ్ మహల్ ను సందర్శించారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.“దే దే ప్యార్ దే” దర్శకుడు..
పంజాబీ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. కొంతకాలం క్రితం తన ప్రియుడిని పరిచయం చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రకుల్ పెళ్లిపై పలు రూమర్లు రాగా.. నా పెళ్లి విషయం నేనే ప్రకటిస్తానని ఫైర్ అయింది ఈ ముద్దుగుమ్మ. రకుల్ ఇప్పుడు బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. తాజాగా ఈ లవ్ బర్డ్స్ ప్రేమకు చిహ్నం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వద్ద దర్శనమిచ్చారు.
Also Read : నాచారంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
రకుల్, జాకీ భగ్నానీ తాజ్ మహల్ ను సందర్శించారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి."దే దే ప్యార్ దే" దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రా వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా.. రకుల్ నటించిన పలు సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రకుల్ - అజయ్ దేవగన్‌తో "రన్‌వే 34", ఆయుష్మాన్ ఖురానాతో కలిసి "డాక్టర్ G", జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి 'అటాక్' సినిమాలు చేసింది. వీటితో పాటు సోలో లీడ్ లో చేసిన సినిమా ఛత్రివాలి కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
Next Story