ఆయన తో సినిమా అంటే… హీరో అందుకు రెడీ అవ్వాల్సిందే!!
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అయ్యే ఉంటాయి. హీరోలను చక్కటి లవర్ బాయ్స్ లా శేఖర్ హీరోల కేరెక్టర్స్ ని [more]
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అయ్యే ఉంటాయి. హీరోలను చక్కటి లవర్ బాయ్స్ లా శేఖర్ హీరోల కేరెక్టర్స్ ని [more]
టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమాలంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అయ్యే ఉంటాయి. హీరోలను చక్కటి లవర్ బాయ్స్ లా శేఖర్ హీరోల కేరెక్టర్స్ ని రాసుకుంటాడు. హీరోయిన్స్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విషయంలోనూ ఎక్కడా తగ్గడు. ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరో తో సినిమా చెయ్యకపోయినా.. శేఖర్ కమ్ముల సినిమాలను మీడియం రేంజ్ హీరోలు ఇష్టపడుతున్నారు. అయితే శేకేర్ ఖమ్ములతో సినిమా అంటే హీరో అయినా హీరోయిన్ అయినా రీ షూట్ లకి సిద్దపడాలట. ఎందుకంటే శేఖర్ కమ్ముల అనుకున్న సీన్ పర్ఫెక్ట్ గా రాకపోతే అస్సలూరుకోడట. చెక్కిందే చెక్కి ఆ సీన్ పర్ఫెక్షన్ వచ్చేవరకు వదలడట. ఏ డైరెక్టర్ అయినా అంతే కానీ. శేఖర్ కమ్ముల స్టయిల్ వేరంటున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య – సాయి పల్లవిల కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ పరిస్థితి కూడా అదే అంటున్నారు.
అంటే కరోనా రాకముందు ఆల్ మోస్ట్ ఫినిష్ అనుకున్న లవ్ స్టోరీ.. కరోనా తర్వాత కొద్దిమేర షూటింగ్ చేస్తే అయిపోతుంది. కానీ శేఖర్ ఖమ్ములకి కరోనా కి ముందు చేసిన షూటింగ్ రషెస్ చూడగా.. కొన్ని ఇంప్రూమెంట్స్ అవసరమని భావించి… వెంటనే చైతు – సాయి పల్లవిలతో రీ షూట్ మొదలు పెట్టాడంటున్నారు. ఇప్పటికే సినిమా పూర్తవ్వాల్సింది కాస్తా.. మళ్ళీ రీ షూట్స్ వలనే చాలా టైం పట్టేస్తుంది అంటున్నారు. ఇక దాని కోసం చైతు – సాయి పల్లవిలు లవ్ స్టోరీ కోసం మరికొన్ని డేట్స్ కేటాయించారని ఫిలింనగర్ టాక్. ఎలాగూ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు కాబట్టి.. హడావిడి గా సినిమా షూటింగ్ పూర్తి చెయ్యక్కర్లేదు. అందులోనూ కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ అయిన అప్పుడే ప్రేక్షకులు రారు… కాబట్టి సినిమా సంక్రాతి వరకు పూర్తయినా నో ప్రాబ్లెమ్. అది శేఖర్ కమ్ముల ధైర్యం. అందుకే ఇలా రీ షూట్స్ మీదే కూర్చున్నాడంటున్నారు.
- Tags
- sekhar kammula