Mon Dec 23 2024 04:18:08 GMT+0000 (Coordinated Universal Time)
లస్ట్ స్టోరీస్ 2.. ట్రైలర్ చూశారా ?
ఫస్ట్ పార్ట్ లో కంటే ఈ సెకండ్ పార్ట్ లో మరింత అడల్ట్ కంటెంట్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
లస్ట్ స్టోరీస్.. 2018లో కంప్లీట్ అడల్ట్ కంటెంట్ తో బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాపై ఎన్నో విమర్శలొచ్చినా.. మంచి సక్సెస్ నే అందుకుంది. తాజాగా దానికి సీక్వెల్ గా లస్ట్ స్టోరీస్ 2 ని రెడీ చేశారు మేకర్స్. ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లోనే జూన్ 29 నుంచి స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సీక్వెల్ కి ఫస్ట్ పార్ట్ తో సంబంధం లేదు. లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ లో కంటే ఈ సెకండ్ పార్ట్ లో మరింత అడల్ట్ కంటెంట్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఎంతమంది నటీనటులున్నా అందరి కళ్లూ తమన్నా- విజయ్ వర్మ పైనే ఉన్నాయి. నిజజీవితంలో వీరిద్దరూ రిలోషన్ లో ఉన్నారన్న వార్తలే ఇందుకు ప్రధాన కారణం.
తాజాగా లస్ట్ స్టోరీస్ 2 లో వీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయడంతో.. ప్రేక్షకుల దృష్టి వారిపైనే ఉంటుంది. ట్రైలర్ లోనూ వీరిద్దరి రొమాన్స్ నే ప్రధానంగా చూపించారు. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ,అమృత సుభాష్, అంగద్ బేడీ.. వంటి నటీనటులు ఈ సిరీస్ లో ఉన్నారు. అయితే.. సీతారామం సినిమాతో.. సీతగా అందరి గుండెల్లో నిలిచిపోయిన మృణాల్ ను ఇలాంటి సిరీస్ లో చూడటం అభిమానులకు కాస్త కష్టంగానే ఉంటుంది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, R బాల్కి, సుజోయ్ ఘోష్ లు డైరెక్ట్ చేసిన లస్ట్ స్టోరీస్ 2లో నాలుగు సెగ్మెంట్ లు ఉండగా.. ఒక్కో సెగ్మెంట్ ను ఒక్కో డైరెక్టర్ తీశారు.
Next Story