Thu Dec 26 2024 02:01:17 GMT+0000 (Coordinated Universal Time)
కరాటే కల్యాణికి మంచు విష్ణు షాక్
ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కరాటే కల్యాణి కారణంగా వివాదం రేగడంతో ఆమె సభ్యత్వాన్ని..
సినీ నటి కరాటే కల్యాణికి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణువర్థన్ షాకిచ్చారు. ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కరాటే కల్యాణి కారణంగా వివాదం రేగడంతో ఆమె సభ్యత్వాన్ని మా అసోసియేషన్ రద్దు చేసింది. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన 100వ పుట్టిన రోజు మే 28న ఖమ్మంలో 54 అడుగులు ఎత్తులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉంది. అయితే విగ్రహ రూపం శ్రీకృష్ణుడిగా ఉండటంతో.. కరాటే కల్యాణి దానిపై రచ్చ చేసింది.
ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కానీ మా దేవుడు కృష్ణుడి రూపంలో కాదు అంటూ మీడియా ముందుకొచ్చింది. ఈ విషయంపై హై కోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై చెలరేగిన వివాదంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మా అసోసియేషన్ కరాటే కల్యాణి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇచ్చిన గడువులోగా వివరణ ఇవ్వని నేపథ్యంలో.. మా అసోసియేషన్ లో కరాటే కల్యాణి సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రఘుబాబు నోటీసులు జారీ చేశారు. మా లో తన సభ్యత్వం రద్దుపై కరాటే కల్యాణి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Next Story