Tue Dec 24 2024 01:57:29 GMT+0000 (Coordinated Universal Time)
పొలిమేర 2 టీజర్ .. ఇది విరూపాక్షను మించిన చేతబడి
తాజాగా సీక్వెల్ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఒకే ఒక్క డైలాగ్ పెట్టి..
టాలీవుడ్ లో ఇప్పుడొచ్చే సినిమాల ట్రెండ్ ఏంటో తెలుసా ? కాకులు, చేతబడులు. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన బలగం, విరూపాక్ష సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తాజాగా చేతబడుల కాన్సెప్ట్ తోనే మరో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. అదే పొలిమేర 2. 2021లో వచ్చిన పొలిమేర.. క్రైమ్ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పుడు ఓటీటీలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రెండేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది చిత్రబృందం. అదే మా ఊరి పొలిమేర 2.
తాజాగా సీక్వెల్ నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఒకే ఒక్క డైలాగ్ పెట్టి.. చేతబడుల సన్నివేశాలతో టీజర్ ను కట్ చేశారు. మొదటి పార్ట్ లో చనిపోయినట్టుగా కనిపించిన సత్యం రాజేశ్.. ఈ టీజర్లో చేతబడులు చేసేవాడిగా కనిపించాడు. ప్రియురాలితో పారిపోయిన సత్యంరాజేశ్.. అక్కడక్కడా చేతబడులు చేస్తుంటాడు. ప్రాణం తీయడం తప్పుకదా అని ఒక మహిళ అంటే.. ప్రాణం తీయడం తప్పు.. బలివ్వడంలో తప్పేంటి అని ఒక వ్యక్తి చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. చివర్లో సత్యం రాజేష్ చేతబడి చేస్తూ రక్తంతో అభిషేకం చేసుకోవడం చూపించారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పొలిమేర 2 ని ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Next Story