Mon Dec 23 2024 03:53:56 GMT+0000 (Coordinated Universal Time)
స్విమ్మింగ్ లో రాణిస్తోన్న స్టార్ హీరో కొడుకు.. ఏకంగా 5 స్వర్ణాలు
మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని భారత్ కు ఐదు స్వర్ణాలను అందించాడు. వేదాంత్ ను చూస్తొంటే..
ఒకప్పటి స్టారీ హీరో, ఇప్పటి విలక్షణ నటుడు మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్ లో తన టాలెంట్ తో అదరగొడుతున్నాడు. గతంలో పలు పతకాలతో వార్తల్లో నిలిచిన వేదాంత్.. మరోసారి వార్తల్లోకెక్కాడు. మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్ షిప్స్ లో పాల్గొన్న వేదాంత్ ఏకంగా.. ఐదు స్వర్ణాలను సాధించి.. దేశాన్ని, తన తల్లిదండ్రులను గర్వించేలా చేశాడు. ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో (50మీ, 100మీ, 200మీ, 400మీ, 1500మీ) లో గెలిచి ఐదు స్వర్ణపతకాలను సాధించాడు. కుమారుడి గెలుపుతో మాధవన్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు.
మాధవన్ తన ఇన్ స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేవుని దయ, మీ అందరి ఆశీస్సులతో వేదంతా స్విమ్మింగ్ లో గెలిచాడు. మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని భారత్ కు ఐదు స్వర్ణాలను అందించాడు. వేదాంత్ ను చూస్తొంటే చాలా గర్వంగా, సంతోషంగా ఉందని, అతనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని మాధవన్ పేర్కొన్నారు. కాగా మాధవన్ గతంలోనూ స్వర్ణ పతకాలను సాధించాడు. ఫిబ్రవరి మహారాష్ట్ర తరపున ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొని 5 స్వర్ణాలు, 2 రజతాలు సాధించాడు. గతేడాది జులైలోనూ 48వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్ షిప్ లో 1500 మీ ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ లో గెలిచి జాతీయ జూనియర్ స్విమ్మింగ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పుడు మలేషియా స్విమ్మింగ్ పోటీల్లోనూ సత్తా చాటడంతో వేదాంత్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు. మాధవన్ కొడుకు ఈ ఘనత సాధించటం పై హీరో వేదాంత్ 5 స్వర్ణాలు గెలవడంతో అతడిని అభినందిస్తూ మాధవన్ పోస్ట్ పై కామెంట్ చేశారు.
Next Story