Fri Nov 22 2024 14:50:25 GMT+0000 (Coordinated Universal Time)
Actress Kasturi: తెలుగు వాళ్లపై అనుచిత వ్యాఖ్యలు.. కస్తూరికి మరిన్ని కష్టాలు
తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరికి బెయిలు
తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరికి బెయిలు ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. నటి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది నటి కస్తూరి. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటున్నారని కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి.
ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ కస్తూరి క్షమాపణలు తెలిపారు. కొంతమందిని ఉద్దేశించి మాత్రమే తానా వ్యాఖ్యలు చేశానని, తెలుగు ప్రజలను ఉద్దేశించి కాదన్నారు. ఆమె వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉండడంతో పరారీలో ఉన్నట్టు గుర్తించారు. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిలు కోసం కస్తూరి హైకోర్టును ఆశ్రయించారు. మద్రాసు హై కోర్టు ఆమె పిటీషన్ ను తిరస్కరించింది.
Next Story