Mon Dec 23 2024 10:27:18 GMT+0000 (Coordinated Universal Time)
హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్.. మూడు వారాల్లో రూ.15 కోట్లు
అనంతరం విశాల్ లైకా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. తన సినిమాల హక్కుల్ని లైకా కు అప్పగించాడు. మధ్యలో ఈ ఒప్పందాన్ని
ప్రముఖ సినీ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. మూడు వారాల్లోగా రూ.15 కోట్లను కోర్టు రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని విశాల్ ను కోర్టు ఆదేశించింది. కేసు వివరాలను చూస్తే.. విశాల్ కు ఫిలిం ఫ్యాక్టరీ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ నిర్మాణ సంస్థ కోసం అన్బుచెళియన్ అనే ఫైనాన్షియర్ నుండి రూ.21.29 కోట్లను విశాల్ అప్పుగా తీసుకున్నాడు. నిర్ణీత సమయంలోగా ఆ అప్పును తీర్చలేకపోవడంతో లైకా ప్రొడక్షన్ ను సంప్రదించాడు విశాల్. అన్బుచెళియన్ అప్పును తీరిస్తే.. అది తీరిపోయేంత వరకు తన సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇస్తానని లైకాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో విశాల్ అప్పులను లైకా ప్రొడక్షన్ క్లియర్ చేసింది.
అనంతరం విశాల్ లైకా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. తన సినిమాల హక్కుల్ని లైకా కు అప్పగించాడు. మధ్యలో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. వీరమే వాగై సూడుం సినిమాను విశాల్ సొంతంగా రిలీజ్ చేయడంతో.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. లైకా వేసిన పిటిషన్ ను విచారించిన సింగిల్ జడ్జి సెషన్స్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని పేర్కొంటూ.. ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. విశాల్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడి ధర్మాసనం సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. రూ. 15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలింఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Next Story