మహానటి శాటిలైట్ హక్కులు ఇంకా అమ్మలేదా..?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన మహానటి మూవీ విడుదలై అప్పుడే 15 రోజులు కావొస్తుంది. ఇప్పటికే మహానటి మూవీ పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చేయడమే కాదు నిర్మాతలకు భారీ లాభాలు కూడా మూట గడుతుంది. మహానటి మూవీ తెలుగు ప్రేక్షకులను, తమిళ ప్రేక్షకులను, ఓవర్సీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంత భారీ హిట్ సాధించిన మహానటి కి ఇంకా శాటిలైట్ హక్కులు అమ్ముడవలేదంటే కొద్దిగా షాకింగ్ విషయమే. సినిమా విడుదలకు ముందు పెద్దగా హైప్ లేని మహానటి సినిమాని కొనేందుకు ఛానల్స్ వారెవరూ పెద్దగా ఇంట్రెస్టు చూపించ లేదు. ఇక సినిమా విడుదలై విజయం సాధించాక కొన్ని ఛానల్స్ మహానటి శాటిలైట్ హక్కుల కోసం పోటీ పడి వైజయంతి వారికీ 18 కోట్లు ముట్టజెప్పి మరీ దక్కించుకున్నాయనే న్యూస్ నడిచింది, కన్ఫర్మ్ అని కూడా అన్నారు.
డిజిటల్ హక్కుల విషయంలో వెనక్కి...
కానీ తాజాగా మహానటి మూవీ శాటిలైట్ హక్కులు అమ్ముడుకాలేదట. ఇప్పటికి మూడు భాషలకు కలిపి సన్ నెట్వర్క్ ఏదైనా ఫాన్సీ రేట్ ఆఫర్ చేస్తుందేమో అని వైజయంతి సంస్థ ఎదురు చూస్తోందని సమాచారం. అయితే మహానటి శాటిలైట్ హక్కులను దక్కించుకోవాలని జీ తెలుగు ఛానల్ విశ్వప్రయత్నం చేసినప్పటికీ వైజయంతి వారు చెప్పిన రేటు దగ్గర అంగీకారం కుదరకపోవడంతో చివరి నిమిషంలో చేతులు ఎత్తేసినట్టు టాక్. అలాగే అమెజాన్ కు డిజిటల్ హక్కులు ఇవ్వాలనే ఆసక్తి ఉన్నప్పటికీ మరీ 50 రోజుల లోపే విడుదల చేసే వాళ్ల పాలసీని దృష్టిలో ఉంచుకుని వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. మరి మహానటి థియేటర్స్ లో కుమ్మిన కలెక్షన్స్ కుమ్ముడికి ఏ ఛానల్ వారు మహానటి ని ప్రసారం చేసినా అదిరిపోయే టిఆర్పీ లు రావడం ఖాయం గనుకనే మహానటి శాటిలైట్స్ కి ఇంత డిమాండ్ ఏర్పడింది.
మూడు భాషలకు కలిపి...
అయితే ఎంత పోటీ ఉన్నప్పటికీ 10 నుండి ఒకేసారి 18 కోట్లు రావడం అంటే మాటలు కాదు. స్టార్ హీరోలకే అంత డిమాండ్ లేనప్పుడు మహానటికి అంత రేటు రావడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నపటికీ మూడు భాషల్లోనూ కలిసి మహానటి అంత పెద్ద మొత్తం శాటిలైట్ రూపంలో రావొచ్చంటున్నారు. చూద్దాం మహానటి శాటిలైట్ హక్కులు ఏ ఛానల్ ఎంత రేటుకు కొంటుందో అనేది.