బాలయ్యా మేలుకో.. లేకపోతే కష్టమే..!
ఎన్టీఆర్ కథానాయకుడు హిట్ అయితే కథ వేరేలా ఉండేది. కానీ అది జరగలేదు. సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మహానాయకుడు రిలీజ్ చిక్కుల్లో పడింది. చాలా రోజులు [more]
ఎన్టీఆర్ కథానాయకుడు హిట్ అయితే కథ వేరేలా ఉండేది. కానీ అది జరగలేదు. సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మహానాయకుడు రిలీజ్ చిక్కుల్లో పడింది. చాలా రోజులు [more]
ఎన్టీఆర్ కథానాయకుడు హిట్ అయితే కథ వేరేలా ఉండేది. కానీ అది జరగలేదు. సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మహానాయకుడు రిలీజ్ చిక్కుల్లో పడింది. చాలా రోజులు డిస్ట్రిబూటర్స్ తో సెటిల్మెంట్ తరువాత రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈనెల 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాపై బాలయ్య ఫ్యాన్స్ లో పెద్దగా ఆసక్తి లేదు. అలానే టీం నుండి కూడా ఎటువంటి బజ్ లేదు. కథానాయకుడు సినిమాకు రోజుకో పోస్టర్ అన్నట్లుగా కుమ్మి పారేసారు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ లో టెన్షన్ పెరుగుతుంది.
ఎన్నికల కోసం 22న విడుదల
ఈ నెలనే రిలీజ్ అవ్వడానికి కారణం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారం లేదా మార్చ్ మొదటి వారం రావడం ఖాయం అని తేలింది. అందుకే ఈలోపే సినిమా రిలీజ్ కాకపోతే తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసొచ్చేదేమీ ఉండదు. ఎలెక్షన్స్ తరువాత రిలీజ్ చేస్తే ఏమీ ఉపయోగం ఉండదు. అందుకే వేరే దారి లేక తప్పని పరిస్థితిలో 22కే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఇంకా వారం టైం మాత్రమే ఉంది ఈలోగా ప్రమోషన్స్ తో హడావిడి చేసేయాలి. లేకపోతే కష్టమే. హాట్ టాపిక్ గా నిలిచే ఓ ట్రైలర్ నో లేదా వరసబెట్టి కొన్ని పోగ్రామ్ లు చేస్తేనో తప్ప ఊపు రాదు. ప్రమోషన్స్ నామమాత్రమే చేస్తే భారీ నష్టాలు రాక తప్పదు.