యుఎస్ లో మహర్షి వసూళ్లు డల్ అవ్వడానికి కారణం ఇదే..!
సినిమాలపరంగా నైజాం తరువాత అంతటి పెద్ద మార్కెట్ ఓవర్సీస్. ఇక్కడ మన తెలుగు సినిమాలన్నీ దాదాపుగా రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా యుఎస్ లో మన తెలుగు సినిమాలు [more]
సినిమాలపరంగా నైజాం తరువాత అంతటి పెద్ద మార్కెట్ ఓవర్సీస్. ఇక్కడ మన తెలుగు సినిమాలన్నీ దాదాపుగా రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా యుఎస్ లో మన తెలుగు సినిమాలు [more]
సినిమాలపరంగా నైజాం తరువాత అంతటి పెద్ద మార్కెట్ ఓవర్సీస్. ఇక్కడ మన తెలుగు సినిమాలన్నీ దాదాపుగా రిలీజ్ అవుతుంటాయి. ముఖ్యంగా యుఎస్ లో మన తెలుగు సినిమాలు చాలా సార్లు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి. అయితే అది మొన్నటి వరకు. ఈ మధ్య అలా లేదు. ఎలాంటి ఫౌండేషన్ లేకుండా కేవలం ఆఫర్లు, ఫ్రీ పాస్‌ల నేపథ్యంలో బిల్డ్ అయిన ఓవర్సీస్ బిజినెస్ బీటలు వారుతోంది. యుఎస్ లో ఒక ఆఫర్ ఉంది. అక్కడ ఒక పాస్ ఉంటే ఎన్ని సినిమాలైనా చూడొచ్చు. ఈ ఆఫర్ మన తెలుగువారంతా తెగ వాడేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఆఫర్స్ యుఎస్ గవర్నమెంట్ ఎత్తేసిందని తెలుస్తోంది. అందుకే కలెక్షన్స్ పరంగా మార్కెట్ డల్ గా ఉందని చెబుతున్నారు యుఎస్ ట్రేడ్ వర్గాలు.
తగ్గిపోయిన కలెక్షన్లు
మహర్షి సినిమాకి ప్రీమియర్ల పరంగా కేవలం అర మిలియన్ డాలర్లు రావడం ఇందుకు నిదర్శనం అని అర్ధం అయిపోయింది.స్పైడర్ లాంటి మూవీకే మిలియన్ డాలర్లు వసూలు చేసిన మహేష్ ‘మహర్షి’కి ఎందుకు కలెక్షన్స్ రావడం లేదంటే ఇదే కారణం. మొన్న జెర్సీకి మంచి టాక్ ఉన్నా వసూళ్లు చాలా మామూలుగానే వచ్చాయి. ఇప్పుడు మహర్షి పరిస్థితి కూడా అంతే. ఓవర్సీస్ కింగ్ అనుకునే మహేష్ సినిమాకే బిజినెస్ ఇంత పడిపోయిందంటే మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఇకపై ఇందుకు తగ్గట్టుగా ఇక్కడి బిజినెస్‌ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందని అక్కడ బయ్యర్లు విశ్లేషిస్తున్నారు.