మహర్షికి ఎందుకు ఇలా జరుగుతుంది..?
మహర్షి మహేష్ బాబు ల్యాండ్ మార్క్ ఫిలిం అని, ఎపిక్ బ్లాక్ బస్టర్ అని ఇలా చాలా రకాలుగా హడావిడి చేస్తున్నారు మేకర్స్. కానీ ఇక్కడ ఆశ్చర్యం [more]
మహర్షి మహేష్ బాబు ల్యాండ్ మార్క్ ఫిలిం అని, ఎపిక్ బ్లాక్ బస్టర్ అని ఇలా చాలా రకాలుగా హడావిడి చేస్తున్నారు మేకర్స్. కానీ ఇక్కడ ఆశ్చర్యం [more]
మహర్షి మహేష్ బాబు ల్యాండ్ మార్క్ ఫిలిం అని, ఎపిక్ బ్లాక్ బస్టర్ అని ఇలా చాలా రకాలుగా హడావిడి చేస్తున్నారు మేకర్స్. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కొన్ని చోట్ల వసూళ్లు భారీగా ఉంటున్నాయి. మరికొన్నిచోట్ల తీసికట్టుగా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలుగు రాష్ట్రాల్లో నైజాంతో పాటు ఆంధ్రలో మంచి వసూళ్ల తెస్తున్న ఈ సినిమాకు నైజాంలో ఏకంగా రూ.20 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఆంధ్రాలో ఈ స్థాయిలో కాకపోయినా వసూళ్లు బాగున్నాయి. కానీ సీడెడ్ లో అంటే రాయలసీమలో మాత్రం ‘మహర్షి’ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఓవర్సీస్ లోనూ అంతే
అక్కడ తొలివారం ఈ మూవీ రూ.6.86 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల పైగా షేర్ రావాలి కానీ ఓవరాల్ రన్ లో 8 కోట్లు కూడా రావడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అలా ఇక్కడ బయ్యర్స్ కి నష్టాలు తప్పేలా లేవు. అటువంటి పరిస్థితే ఓవర్సీస్ లో ఉంది. అక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 3.5 – 4 మిలియన్ల వరకు వసూలు చేయాలి. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా 1.6 మిలియన్ డాలర్లే రాబట్టింది. ఫుల్ రన్ లో మహా అయితే 2.5 మిలియన్ మార్కును అందుకోవచ్చేమో అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మహేష్ గత చిత్రం ‘భరత్ అనే నేను’ యుఎస్‌లో 3.5 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. కానీ మహర్షి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నప్పటికీ అంత కలెక్ట్ చేయడం లేదు.