అప్పుడు 12 కోట్లు ఇప్పుడు 8 కోట్లు..!
సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో విలెజ్ సెట్ ఎంత అందంగా ఉందో సినిమాలో చూశాం. మొదట్లో రంగస్థలం షూటింగ్ ని చాలా రోజుల వరకు గోదావరిని అనుకుని ఉన్న... రాజమండ్రి పరిసర ప్రాంతాల పల్లెటూర్లలో చిత్రీకరించారు. కానీ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో అక్కడ సినిమా షూటింగ్ చెయ్యడం తలకు మించిన కష్టం అవడంతో సుకుమార్ హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ ప్రాంతంలో 22 ఎకరాల్లో 12 కోట్ల ఖర్చుతో పల్లెటూరి సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ చేత వేయించాడు. మరి రంగస్థలం సినిమా మొత్తం ఆ ఊరిలో తియ్యాల్సి రావడంతో సుకుమార్ అంత ఖర్చు పెట్టించాడు.
ఏదైనా ఊర్లో చేద్దామనుకున్నా...
ఇక తాజాగా మహేష్ బాబు మహర్షి సినిమా కోసం హైదరాబాద్ లోనే పల్లెటూరి సెట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కొంతమేర అమెరికాలో షూటింగ్ చేసిన మహర్షి టీం ప్రస్తుతం పల్లెటూరి వాతావరణ ప్రతిబింబించే పల్లెటూరి సెట్ లో జరుగుతుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ పల్లెటూరి సెట్ ని 8 కోట్లతో వేయించాడట. అయితే మహర్షి సినిమా ఎక్కువ శాతం గ్రామీణ నేపథ్యంలో ఉంటుందట. మహేశ్ బాబు రైతు పాత్రలో ఈ పల్లెటూరి సెట్ లోనే కనబడతాడని సమాచారం. అయితే రంగస్థలం లాగా మొదట్లో మహర్షి టీం కూడా ఈ పల్లెటూరి షూటింగ్ కోసం నిజమైన గ్రామాల్లో షూట్ చేద్దామని భావించి ఆంధ్రలోని కొన్ని గ్రామాలకు వెళ్లి చూసి వచ్చారట.
అభిమానుల తాకిడి ఉంటుందని...
కానీ రామ్ చరణ్ మాదిరిగానే మహేష్ ఫాన్స్ కూడా షూటింగ్ జరక్కుండా ఇబ్బందులు పెడితే షూటింగ్ కి గ్యాప్ వచేస్తుందనే ఆలోచనతోనే ఇలా మహర్షి కోసం పల్లెటూరి సెట్ ని దించారట. మరి ఆ 8 కోట్ల పల్లెటూరి సెట్ లో చిత్రీకరించే పల్లెటూరి సన్నివేశాలు మహర్షి మూవీలో కీలకం కానున్నాయట. ఇక దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు ఖర్చుకి వెనకాడకుండా మహర్షి కోసం భారీ మొత్తం ఖర్చు పెడుతున్నారట.