మహర్షికి తమిళనాట చిక్కులు తప్పవా..?
మరో రెండు రోజుల్లో మహేష్ ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. [more]
మరో రెండు రోజుల్లో మహేష్ ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. [more]
మరో రెండు రోజుల్లో మహేష్ ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అవుతున్న ఈ సినిమాకు తమిళనాడులో చిక్కులు ఎదురైయ్యేలా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో కూడా సమాంతరంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాను కొంతమంది థియేటర్ల యాజమానులు వేసేందుకు సుముఖంగా లేరట. తమిళనాడులో ప్రముఖ థియేటర్ చైన్ గా గుర్తింపు ఉన్న వెట్రి సినిమా యాజమాన్యం, మరో సంస్థ జికే సినిమాస్ కు బయ్యర్స్ కి మధ్య షేరింగ్ పెర్సెన్టేజ్ గురించి అండర్ స్టాండింగ్ కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
చర్చలు ఫలిస్తే ఓకే
రేపటిలోగా దీనికి పరిష్కారం కాకపోతే వారు ఈ సినిమాను వేసే ఛాన్స్ లేదు. అయితే దీన్ని పరిష్కరించేందుకు బయ్యర్ల తరపున కొందరు చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి అడ్వాన్సు బుకింగ్ ఈ స్క్రీన్లకు సంబంధించి ఇంకా పెట్టలేదు. ‘మహర్షి’తో తమిళనాడులో మార్కెట్ పెంచుకుందాం అనుకున్న మహేష్ కు ఇది ఎదురుదెబ్బే. రేపటిలోగా ఈ అడ్డంకి తొలిగిపోతే మరింత మెరుగ్గా ఓపెనింగ్ ఫిగర్స్ నమోదయ్యే అవకాశం ఉంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ ఇష్యూ క్లోజ్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.