Sun Dec 22 2024 17:50:18 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో ట్విస్ట్ .. తొలిసారి నెగిటివ్ షేడ్స్ లో మహేష్
సినిమాలో దుర్మార్గులపై విలనిజం చేసే హీరోగా మహేష్ చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుందని టాక్ ఉంది. ఇప్పటివరకూ డీసెంట్ లవర్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ తివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా షూటింగ్ మొదలై చాలారోజులైనా.. ఇంతవరకూ ఫస్ట్ లుక్ మినహా ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా అప్డేట్ కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్ ఉంటుందని టాక్. ఓ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది.
అలాగే సినిమాలో దుర్మార్గులపై విలనిజం చేసే హీరోగా మహేష్ చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుందని టాక్ ఉంది. ఇప్పటివరకూ డీసెంట్ లవర్ బాయ్ గా, ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించిన మహేష్.. తొలిసారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని తెలియడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇందులో పూజా హెగ్డే మాత్రమే కాకుండా.. శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియోషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Next Story