Mon Dec 23 2024 03:30:27 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ ఫ్యాన్స్ మరీ ఇంత వయొలెంట్ గా ఉన్నారేంటో..!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్‌మ్యాన్ సినిమా రీరిలీజ్ అవ్వనుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్‌మ్యాన్ సినిమా రీరిలీజ్ అవ్వనుంది. మహేష్ బాబు పుట్టినరోజు నాడు ఆగస్ట్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రీరిలీజ్ కు ముందే రికార్డులను తిరగరాసింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డు కలెక్షన్లు రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్క హైదరాబాద్ లోనే రూ.కోటి దాటడం విశేషం. రీరిలీజ్ అయిన సినిమాల్లో ఇలా హైదరాబాద్ లోనే, అందులోనూ అత్యంత వేగంగా రూ.కోటి అడ్వాన్ బుకింగ్స్ వసూలు చేసిన తొలి సినిమా ఈ బిజినెస్‌మ్యాన్. దీనిని బట్టి మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా సినిమా రీరిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
RR బ్యానర్‌పై RR వెంకట్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, మహేష్ బాబు తదితరులు నటించారు. ఈ చిత్రం 2012 జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లు వసూలు చేసింది. బిజినెస్ మ్యాన్ సినిమాకు ఎస్ఎస్ థమన్ మ్యూజిక్, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫి అందించారు. ప్రస్తుతం ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా టెక్నాలజీలను జోడించి 4K తో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో మహేష్-పూరీ కాంబినేషన్ లోనే వచ్చిన పోకిరి సినిమా కారణంగా బిజినెస్‌మ్యాన్ మీద కూడా భారీ హైప్ వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా సినిమా భారీ హిట్ గా నిలిచింది. వీరి కాంబినేషన్ లో జనగణమన సినిమా వస్తుందని అనుకున్నారు. అయితే ఆ సినిమా విజయ్ దేవరకొండకు వెళ్లడం.. లైగర్ ఫ్లాప్ కారణంగా అది కూడా నిలిచిపోవడం జరిగింది.
Next Story