Sun Dec 22 2024 22:15:58 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : మరోసారి అన్స్టాపబుల్ షోకి మహేష్ బాబు..
గుంటూరు కారం ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు మరోసారి అన్స్టాపబుల్ షోకి రానున్నారట.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోకి అతిథిగా వెళ్లిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్ లాస్ట్ ఎపిసోడ్ కి మహేష్ గెస్ట్ గా వెళ్లి గ్రాండ్ ఎండింగ్ ని ఇచ్చారు. ఆ ఎపిసోడ్ ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డులని మళ్ళీ తిరిగి రాయడానికి మహేష్ బాబు, బాలయ్యతో బాతాఖానికి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం అన్స్టాపబుల్ షో మూడో సీజన్ జరుగుతుంది.
ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి. రెండో ఎపిసోడ్ కి బాలీవడ్ రణబీర్ కపూర్ ని 'యానిమల్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తీసుకు వచ్చి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబుతో కూడా ఒక ఎపిసోడ్ ని ప్లాన్ చేశారట. ఈ ఎపిసోడ్ ని గుంటూరు కారం ప్రమోషన్స్ లో భాగంగా తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆల్రెడీ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీం.. సినిమాలోని సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. త్వరలోనే టీజర్ అండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇంటర్వ్యూ ప్రమోషన్స్ ని అన్స్టాపబుల్ షో ద్వారా చేయనున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి ఈ షోలో పాల్గొనున్నారట. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ త్వరలోనే చేయనున్నారట.
ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు మరోసారి అన్స్టాపబుల్ షోకి వస్తున్నాడంటే.. అభిమానుల్లో జోష్ మొదలయింది. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే. కాగా గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
Next Story