Mon Dec 23 2024 16:33:50 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ జన్మంటూ ఉంటే.. నువ్వే నాకు అన్నయ్య అవ్వాలి : మహేష్
మహేష్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో.. అన్నయ్య కడసారి చూపుకు కూడా నోచుకోలేక.. తీరని వేదనతో కుమిలిపోతూ.. సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత
సూపర్ స్టార్ కృష్ణ పెద్దకొడుడు, మహేష్ బాబు అన్నయ్య అయిన రమేష్ బాబు గతరాత్రి తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కాగా.. తన అన్నయ్య అకాలమరణం పట్ల మహేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అన్న మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మహేష్ కు కోవిడ్ పాజిటివ్ రావడంతో.. అన్నయ్య కడసారి చూపుకు కూడా నోచుకోలేక.. తీరని వేదనతో కుమిలిపోతూ.. సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు. "నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వే నాకు అండ. నిన్ను చూసుకునే నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వే నా సర్వస్వం. నువ్వు నా జీవితంలో లేకపోతే ఇవాళ నేనున్న స్థాయిలో సగం కూడా ఉండేవాడ్ని కాదేమో! నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికి కృతజ్ఞతలు. ఈ జన్మలోనే కాదు, మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అన్నయ్య. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను... ఎప్పటికీ! విశ్రాంతి తీసుకో అన్నయ్యా... విశ్రాంతి తీసుకో!" అంటూ మహేశ్ బాబు తీవ్ర భావోద్వేగాలతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై మహేష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. స్ట్రాంగ్ గా ఉండాలి మహేష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story