Mon Dec 23 2024 16:21:30 GMT+0000 (Coordinated Universal Time)
Venkatesh : వెంకటేష్ కూతురి పెళ్లి సెలబ్రేషన్స్‌లో.. మహేష్ బాబు ఫ్యామిలీ..
వెంకటేష్ తన రెండో కూతురి వివాహాన్ని సైలెంట్ గా చేస్తున్నారు. నిన్న రాత్రి మెహందీ వేడుక జరగగా, మహేష్ బాబు ఫ్యామిలీ..
Venkatesh : టాలీవుడ్ హీరో వెంకటేష్ గత ఏడాది అక్టోబర్ లో తన రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంలోని కుర్రాడికి.. వెంకటేష్ తన కూతుర్ని ఇస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్ లోని ఒక హోటల్ లో చాలా సింపుల్ గా ఈ దగ్గుబాటి నిశ్చితార్థం వేడుక జరిగింది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సూపర్ స్టార్ మహేష్ బాబు, అక్కినేని నాగచైతన్యతో పాటు ఇరు కుటుంబసభ్యులు హాజరయ్యి కొత్త జంటని ఆశీర్వదించారు. ఇక అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్న ఈ జంట.. ఇప్పుడు ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. వీరి వివాహం ఈరోజునే (మార్చి 15) జరగబోతుందట. ఆల్రెడీ పెళ్లి సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.
హెల్దీ, మెహందీ అంటూ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిన్న రాత్రి మెహందీ ఫెస్టివల్ జరగగా.. మహేష్ బాబు సతీమణి నమ్రత, కూతురు సితార హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుందని సమాచారం. కేవలం ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరుకాబోతున్నారట.
కాగా వెంకటేష్ కి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. వీరిలో పెద్ద అమ్మాయి ఆశ్రీతకి ఆల్రెడీ పెళ్లి అయ్యిపోయింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని వివాహం జరుగుతుంది. దీంతో దగ్గుబాటి అభిమానులంతా.. సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Next Story