సాయి పల్లవితో మహేష్ సినిమా..!
నిన్న సోషల్ మీడియాలో ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఫిదా భామ సాయి పల్లవి నటిస్తుందనే న్యూస్ తెగ వైరల్ అయ్యింది. టాలీవుడ్ లో [more]
నిన్న సోషల్ మీడియాలో ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఫిదా భామ సాయి పల్లవి నటిస్తుందనే న్యూస్ తెగ వైరల్ అయ్యింది. టాలీవుడ్ లో [more]
నిన్న సోషల్ మీడియాలో ఒక్కసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఫిదా భామ సాయి పల్లవి నటిస్తుందనే న్యూస్ తెగ వైరల్ అయ్యింది. టాలీవుడ్ లో కెరీర్ లో ఎన్ని ప్లాపులున్నా.. ప్రస్తుతం ఫుల్ క్రేజున్న స్టార్ హీరో రేంజ్ మహేష్ బాబుది. నెంబర్ వన్ పొజిషన్ కి చేరువలో మహేష్ క్రేజ్ కి ఫాలోయింగ్ ఉంది. అలాంటి స్టార్ హీరో పక్కన సూపర్ క్రేజ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుందనే న్యూస్ ట్రేండింగ్ లోకొచ్చేసింది. ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరో సరసన కూడా నటించని సాయి పల్లవి ఇప్పుడు మహేష్ పక్కన హీరోయిన్ అనగానే అందరూ ఆశ్చర్యపోయారు.
పరిశీలనలో సాయి పల్లవి
ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే… సాయి పల్లవి తెలుగులో పడి పడి లేచే మనసు, తమిళంలో మారి 2 ఫ్లాప్స్ తో ఉంది. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా.. సాయి పల్లవి నటనకు అదిరిపోయే మార్కులు పడ్డాయి. అలాగే ప్రస్తుతం తెలుగులో అస్సలు అవకాశాలు లేని ఈ భామ తమిళనాట సూర్య సరసన నటిస్తుంది. అయితే మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో సాయి పల్లవి పేరు హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.
మహేష్ ఛాన్స్ ఇచ్చాడా..?
మరి ఇప్పటివరకు హీరోలను డామినేట్ చేసే పాత్రలలో అదరగొట్టిన సాయి పల్లవికి.. స్టార్ హీరోలెవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే సాయి పల్లవి నటన ముందు తేలిపోతామేమో అనే భయం కాబోలు. మరి ఇప్పుడు మహేష్ ఎలా ఛాన్స్ ఇచ్చాడో. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. మహేష్ కున్న క్రేజ్ కి సాయి పల్లవి క్రేజ్ కూడా తోడైతే.. ఆ సినిమా మీదుండే అంచనాలు తార స్థాయిలో ఉంటాయంటున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి .. మహేష్ తో చెయ్యబోయే సినిమా లైన్ సాయి పల్లవికి వినిపించడానికి చెన్నైకి వెళ్లినట్టుగా టాక్. అలాగే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని ఎంచుకున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.