Mon Dec 23 2024 03:28:25 GMT+0000 (Coordinated Universal Time)
SSMB28 First Look: ఊర మాస్ లుక్లో మహేశ్ బాబు
తాజాగా SSMB28 నుండి మహేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మహేశ్ గళ్ల చొక్కా, తలకు రిబ్బన్..
సూపర్ స్టార్ మహేష్ హీరోగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా SSMB28. ప్రస్తుతం SSMB28 వర్కింగ్ టైటిల్ తోనూ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత.. మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. హారికా, హాసినీ క్రియేషన్స్ సంస్థపై ఎస్ రాధాకృష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. 2024, జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.
తాజాగా SSMB28 నుండి మహేశ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మహేశ్ గళ్ల చొక్కా, తలకు రిబ్బన్ కట్టుకుని ఒంటి కాలితో మోకాలి మీద కూర్చొని భూమికి దండం పెడుతూ కనిపించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థియేటర్లలో మాస్ స్ట్రైక్కి మరో రెండు రోజులు మాత్రమే ఉంది అని రాసుకొచ్చింది చిత్ర బృందం. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా SSMB28 టైటిల్ ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’, ‘ఊరుకి మొనగాడు’ టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. వీటిలో ఏదొక టైటిల్ ఉంటుందా లేక కొత్త టైటిల్ వస్తుందా అన్నది 31న తెలుస్తుంది. ఇదే రోజున కృష్ణ నటించిన మోసగాళ్ళకి మోసగాడు సినిమాను 4K వెర్షన్ లో రీరిలీజ్ చేస్తున్నారు.
Next Story