Mon Dec 23 2024 16:35:06 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : మరో గొప్ప నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు..
ఇన్నాళ్లు పిల్లల గుండె చప్పుడు అయిన మహేష్ బాబు ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు MB ఫౌండేషన్ స్థాపించి చిన్న పిల్లల గుండె చికిత్సలకు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికి వెయ్యికి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి వారి గుండె చప్పుడు అయ్యారు. కేవలం ఈ ఒక్క కార్యక్రమం మాత్రమే కాదు. ఆ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఆ ఫౌండేషన్ లో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గత సంవత్సరం నవంబర్ 15న మరించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అందరికి దూరమయ్యి నిన్నటితో సంవత్సరం అవ్వడంతో కృష్ణ కుటుంబసభ్యులు స్మారక దినం నిర్వహించి ఆయనకు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఘట్టమనేని ఫ్యామిలీ మెంబెర్స్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇక ఇలాంటి దుఃఖ దినంలో కూడా మహేష్ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అభినందనలు అందుకుంటున్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్ లో 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్' అనే కొత్త ప్రోగ్రాంని నిన్న లాంచ్ చేశారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా మహేష్ బాబు.. 40 మంది పేద విద్యార్థులకు చదువు అందించనున్నారు. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఆ విద్యార్థులు విద్యా బాధ్యతలన్నీ మహేషే చూసుకున్నారు. ఇన్నాళ్లు పిల్లల గుండె చప్పుడు అయిన మహేష్ బాబు ఇక నుంచి విద్యార్థుల భవిషత్తుకు వెలుగు అవ్వనున్నారు.
తండ్రి మీద ప్రేమని కూడా సేవా కార్యక్రమంగా మలిచిన మహేష్ నిర్ణయం పై అభిమానులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా మహేష్ బాబు మాత్రమే కాదు, ఆయన వారసులు గౌతమ్, సితార కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. చిన్న వయసు నుంచే సేవ కార్యక్రమాలకు పూనుకుంటూ తమ గొప్ప మనసుని చాటుకొని అభిమానుల మన్నెలలు అందుకుంటున్నారు.
Next Story