Mon Dec 23 2024 03:24:21 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : ఇలా కాపీ కొట్టి.. అలా దొరికిపోయిన థమన్..
గుంటూరు కారం నుంచి 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో. అప్పుడే ఆ సాంగ్ కాపీ వెర్షన్ మీమ్స్ వైరల్..
Guntur Kaaram : అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కలిసి చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. సినిమాలోని ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం చేస్తున్నారు.
సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉండగా.. 'ధమ్ మసాలా', 'ఓ మై బేబీ సాంగ్స్' రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. నేడు ఈ మూవీలోని మూడో సాంగ్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారిన 'కుర్చీ మడతపెట్టి' డైలాగ్ తో ఈ పాట లిరిక్స్ ని రాశారు. పూర్తీ డీజే సాంగ్ గా థమన్ సంగీతం చేశారు. అయితే ఈ డీజేని కూడా థమన్ కాపీ కొట్టారని నెటిజెన్స్ చెబుతున్నారు.
ఆల్రెడీ యూట్యూబ్ లో ఆ డైలాగ్ పై వచ్చిన డీజే సాంగ్నే గుంటూరు కారంలో పాటగా పెట్టేశారంటూ.. సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆ కాపీ కొట్టిన ట్యూన్ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ అభిమానులు ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహేష్ వంటి స్టార్ హీరోని పెట్టుకొని అలాంటి లిరిక్స్ ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story