Mon Dec 23 2024 06:54:10 GMT+0000 (Coordinated Universal Time)
Kurchi Madathapetti: ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ వేరే భాషల్లో ఎలా ఉందో విన్నారా..!
గుంటూరు కారంలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ వేరే భాషల్లో ఎలా ఉందో విన్నారా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల హీరోహీరోయిన్స్గా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ని నమోదు చేసి సూపర్ హిట్టుని అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈరోజు అర్ధరాత్రే నుంచే షో మొదలవ్వడంతో ఆడియన్స్ మరోసారి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే అందరిలో ఓ సందేహం నెలకుంది. సినిమాలో సూపర్ హిట్ సాంగ్ గా నిలిచిన ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. ఇతర భాషల్లో ఎలా వినిపించారో అనే డౌట్ అందరిలో మొదలయింది. దీంతో నెట్ఫ్లిక్స్ లో లాంగ్వేజ్ ఆప్షన్ చేంజ్ చేసి.. ఆ పాటని ఒకసారి వినేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ సినిమాలోని సంభాషణలతో పాటు ఆ పాటని కూడా ఆయా భాషల్లోనే ఆడియన్స్ కి వినిపించారు. మరి ఆ పాటని మీరు కూడా వినేయండి.
కాగా ఈరోజు ఈ సినిమాతో పాటు అరగాజనకు పైగా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల నటించిన ‘బబుల్గమ్’.. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తమిళ హీరో ధనుష్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈటీవీ విన్లో క్రైమ్ కామెడీ డ్రామా ‘రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ స్ట్రీమ్ అవుతుంది.
హాలీవుడ్ చిత్రాలు విషయానికి వస్తే.. ‘ది మార్వెల్స్’ హాట్స్టార్లో, ‘ది నన్ 2’ అండ్ 'ది ఎక్సర్సిస్ట్ బిలీవర్' జియో సినిమాస్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాలు తెలుగు, హిందీ, తమిళ లాంగ్వేజ్స్ లో అందుబాటులో ఉన్నాయి. శివకార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా నేడు సన్ నెక్స్ట్ రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్తుతం అది కేవలం తమిళ బాషలోనే అందుబాటులో ఉంది.
Next Story