Mon Dec 23 2024 01:49:25 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : RRR, సలార్ రికార్డు బ్రేక్ చేసిన గుంటూరు కారం..
RRR, సలార్ రికార్డు బ్రేక్ చేసిన మహేష్ బాబు గుంటూరు కారం. ఏంటో తెలుసా..?
Guntur Kaaram : మహేష్ బాబు మరోసారి త్రివిక్రమ్ మీద నమ్మకం పెట్టి చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా.. ఆడియన్స్ ని ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడ్డాయి. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉండడంతో.. గుంటూరు కారం పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు మునుపెన్నడూ కనిపించినంత మాస్ అవతార్ లో కనిపించబోతున్నాడు అని మేకర్స్ చెప్పడం, మూవీ నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ కూడా అదే రేంజ్ లో ఉండడంతో అభిమానుల్లో ఓ రేంజ్ క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
మహేష్ బాబుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సినిమా ఓపెనింగ్స్ తోనే సగం బడ్జెట్ ని రికవరీ చేసేస్తారు. ఇక ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో గుంటూరు కారం అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా మహేష్కి మన తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా భారీ ఓపెనింగ్స్ అండ్ కలెక్షన్స్ వస్తాయి. అక్కడ అత్యధికంగా వన్ మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోగా మహేష్ కి ఓ రికార్డు ఉంది. ఇప్పుడు మరో రికార్డుని కూడా సృష్టించారు.
గుంటూరు కారం చిత్రానికి అమెరికాలో అత్యధిక ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. దాదాపు 5408 పైగా స్క్రీన్స్ లో గుంటూరు కారం ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఇది ఆల్ టైం రికార్డు, ఎందుకంటే గతంలో రిలీజ్ అయిన RRRకి 3800 పైగా, సలార్కి 2450 పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. కానీ గుంటూరు కారం ఒక రీజినల్ మూవీ. దానికి ఈ స్థాయిలో ప్రీమియర్స్ పడడం.. నిజంగా మహేష్ మ్యానియా అనడంలో ఏ సందేహం లేదు.
Next Story