Sat Dec 21 2024 02:29:07 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh - Prabhas : గుంటూరోడు పై సలారోడు పైచేయి.. సాంగ్స్ రికార్డులు..
మహేష్ బాబు, ప్రభాస్ నటిస్తున్న గుంటూరు కారం, సలార్ సినిమాలు నుంచి నిన్న కొత్త సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' అనే లవ్లీ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.
Guntur Kaaram - Salaar : మహేష్ బాబు, ప్రభాస్ నటిస్తున్న గుంటూరు కారం, సలార్ సినిమాలు నుంచి నిన్న కొత్త సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' అనే లవ్లీ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక సలార్ చిత్రం నుంచి 'సూర్యుడే గొడుగు పట్టి' అనే ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ అయ్యింది. రవి బస్రూర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ రెండు పాటల్లో ముందుగా గుంటూరు కారం సాంగ్ రిలీజ్ కాగా.. 45 నిమిషాల తరువాత సలార్ పాట విడుదల అయ్యింది. గుంటూరోడు కంటే లేటుగా వచ్చినా.. యూట్యూబ్ లో మాత్రం రికార్డు వ్యూస్ అందుకుంటూ సలారోడు తనదే పైచేయి అని అనిపించుకుంటున్నాడు. రిలీజ్ అయిన 12 గంటల్లో గుంటూరు కారం సాంగ్ 2M వ్యూస్, 156K లైక్స్ ని అందుకుంటే.. సలార్ సాంగ్ 3.6M వ్యూస్, 434K లైక్స్ ని రాబట్టి అదుర్స్ అనిపిస్తుంది.
ఇక ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నారు. కాగా రిలీజ్ లోపు సలార్ మూవీ నుంచి మరో సాంగ్, ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది.
గుంటూరు కారం విషయానికి వస్తే.. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలు ఖలేజా, అతడు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కాకపోయినా.. ఇప్పుడు ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫార్మ్ లో ఉన్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Next Story