Sun Dec 22 2024 09:24:46 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : రిలీజ్‌కి ముందే గుంటూరు కారం రికార్డు కలెక్షన్స్..
గుంటూరు కారం మూవీ రిలీజ్‌కి ముందే అమెరికాలో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. మరికొన్ని రోజుల్లో..
Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా రికార్డు స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. అమెరికాలో ఆల్ టైం రికార్డు స్థాయిలో 5408 పైగా స్క్రీన్స్ లో గుంటూరు కారం ప్రీమియర్స్ పడబోతున్నాయి. దీంతో ఈ సినిమాని మొదటిరోజే చూసేందుకు ప్రతి ఒక్కరు ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు.
ఇక ఈ ప్రీ బుకింగ్స్ తో రిలీజ్ కి ముందే రికార్డు కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. ఈక్రమంలోనే ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా అమెరికాలో ఈ చిత్రం ఇప్పటివరకు 500K డాలర్స్ పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాతలు తెలియజేసారు. అంటే రిలీజ్ కి ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్స్ రాబట్టేసింది. విడుదలకు ఇంకా ఐదు రోజులు సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఆ హాఫ్ మిలియన్ కూడా వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా మహేష్ బాబు అమెరికాలో 1M డాలర్లు రాబట్టడంలో పెద్ద రికార్డే ఉంది.
ఇప్పటి వరకు 11 సినిమాలతో మహేష్ ఈ వన్ మిలియన్ మార్క్ ని అందుకొని అక్కడ నెంబర్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ చిత్రంతో కూడా ఆ మిలియన్ మార్క్ ని అందుకుంటారు. కానీ రిలీజ్ కి ముందే జరిగేలా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ మూవీ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
Next Story