Mon Dec 23 2024 16:19:13 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : గుంటూరు కారం కోసం ఆ టెక్నాలజీ.. దాని ప్రత్యేకత ఏంటి..?
గుంటూరు కారం కోసం ఆ టెక్నాలజీని వాడుతున్న మేకర్స్. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే అనేక కారణంతో లెట్ అవుతూ, రిలీజ్ పోస్టుపోన్ అవుతూ వచ్చిన ఈ చిత్రం.. ఈసారి మాత్రం చెప్పిన తేదికి కచ్చితంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ కష్టపడుతున్నారు. ఈ మూవీ రిలీజ్ కి మరో నెల రోజులు సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో జరుగుతుంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ వర్చువల్ స్టూడియో ప్రత్యేకత ఏంటి..? దర్శకులు తమ సినిమా కథకి అనుగుణంగా కొన్ని బయట లొకేషన్స్ కి వెళ్లి షూటింగ్ చేస్తుండడం అందరూ చూస్తూనే ఉంటారు. అయితే ఈ వర్చువల్ టెక్నాలజీ ద్వారా బయట లొకేషన్స్ కి వెళ్లనవసరం లేదు. సీన్ కి కావాల్సిన లొకేషన్ ని బ్యాక్గ్రౌండ్ లో వర్చువల్ స్క్రీన్ ద్వారా ప్రెజెంట్ చేస్తారు. దీంతో ఆ లొకేషన్ కి వెళ్లకుండానే.. ఆ లొకేషన్ లో షూట్ చేసిన అనుభూతిని వర్చువల్ స్టూడియో కలిగిస్తుంది.
గుంటూరు కారం మూవీ ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతం చుట్టూ తిరగనుందట. ప్రస్తుతం ఉన్న సమయంలో అక్కడకి వెళ్లి అవుట్ డోర్ లో షూట్ చేయాలంటే కొంచెం టైం ప్రాసెస్ పని అని చెప్పాలి అందుకనే మేకర్స్ అందుకు సంబంధించిన సీన్స్ ని ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో చిత్రీకరిస్తునట్లు తెలుస్తుంది. గతంలో మహేష్ బాబు 'సర్కారీ వారి పాట' సినిమాలో వైజాగ్ లొకేషన్స్ ని కూడా ఇలానే చిత్రీకరించారు. అయితే అవి ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో చిత్రీకరించినవి కాదు.
కాగా ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి మహేష్ కి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మొదటి సాంగ్ ‘ధమ్ మసాలా’ సూపర్ హిట్ అయ్యింది. త్వరలోనే సెకండ్ సాంగ్ ని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం నాలుగు సాంగ్స్ ఉన్నాయట. జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Next Story