Mon Dec 23 2024 19:26:12 GMT+0000 (Coordinated Universal Time)
Guntur Kaaram : గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్..?
నెట్టింట వైరల్ అవుతున్న 'మసాలా బిర్యానీ' సాంగ్ గుంటూరు కారం సినిమాలోనిదేనా..? సాంగ్ లీక్ అయ్యిందా..?
త్రివిక్రమ్, మహేష్ బాబు మూడోసారి కలిసి చేస్తున్న సినిమా 'గుంటూరు కారం'. 2024 సంక్రాంతి రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ నుంచి ఒక సాంగ్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం.. సాంగ్ కంపోసిషన్ అయ్యిపోయింది, చిత్రీకరణ అయ్యిపోయింది, సాంగ్ లో మహేష్ బాబు అదరగొట్టేశాడు అని చెబుతున్నారు తప్ప రిలీజ్ చేయడం లేదు.
ఇటీవల నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. నవంబర్ ఫస్ట్ వీక్ లో కచ్చితంగా సాంగ్ రిలీజ్ అయ్యిపోతుందంటూ చెప్పుకొచ్చాడు. ఫస్ట్ వీక్ పూర్తి అయ్యిపోతుంది. కానీ సాంగ్ గురించిన అప్డేట్ ఇంకా రావడం లేదు. ఎవరో ఈ పాటని లీక్ చేసేశారు. అయితే తాజాగా గుంటూరు సాంగ్ అంటూ ఒక పాట నెట్టింట వైరల్ అవుతుంది. 'మసాలా బిర్యానీ' సాంగ్ అంటూ చిన్న బిట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ సాంగ్ నిజంగా గుంటూరు కారంకి సంబంధించిందేనా..? అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ లీకైన పాటకి ఆడియన్స్ నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. గుంటూరు కారం మీద ఉన్న అంచనాలకు తగ్గట్టు ఈ పాట లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.
కాగా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గత రెండు సినిమాలు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారంని పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు కనిపించినంత మాస్ రోల్ లో కనిపించబోతున్నాడంటూ మేకర్స్ చెబుతున్నారు. కాగా గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అందుకోలేకపోయాయి. మరి ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ చూస్తుందో చూడాలి.
Next Story